Saturday, May 4, 2024
- Advertisement -

వాడు ఏమైనా చిన్న పిల్లాడా?

- Advertisement -

బాహుబ‌లి సినిమా ద‌గ్గ‌ర నుండి ప్ర‌భాస్ పెళ్లి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.ప్రభాస్‌కు భీమ‌వ‌రం అమ్మాయితో పెళ్లి, ఫిక్స్ అయింద‌ని ,హీరోయిన్ అనుష్క‌ని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ,మెగా డాట‌ర్ నిహారిక‌తో పెళ్లి కుదిరింద‌నే వార్త‌లు ప్ర‌భాస్ పెళ్లిపై హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక తాజాగా ప్ర‌భాస్ పెళ్లిపై కృష్ణంరాజు స్పందించారు. మీడియా ప‌దే ప‌దే నన్ను ప్ర‌భాస్ పెళ్లి గురించి అడ‌గ‌వ‌ద్ద‌ని ఆయ‌న మీడియాను హెచ్చ‌రించారు. కృష్టంరాజు బీజేపీ పార్టీలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న పార్టీ త‌రుపున మీడియా ముందుకు వ‌స్తే.. మీడియా వాళ్లు ప్ర‌భాస్ పెళ్లి గురించి అడ‌గ‌డంతో కృష్ణంరాజు కొంత అస‌హ‌నానికి గురైయ్యారు. వాడు ఏమైనా చిన్న పిల్లాడా, ముప్పై ఏళ్లు దాటాయి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ప్ర‌భాస్‌కు తెలుసు. ద‌య‌చేసి ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎప్పుడు అడ‌గాలో తెలుసుకోండి అంటు మీడియాకు చురుక‌లు అంటించారు కృష్ణంరాజు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమాతో బిజిగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -