Friday, March 29, 2024
- Advertisement -

నానితో మ‌రోసారి కీర్తి సురేష్‌

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌ర‌స పెట్టి సినిమాలు తీస్తున్నాడు.నాని ప్రస్తుతం సీనియర్‌ హీరో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత నాని పీరియాడిక్‌ డ్రామాలో న‌టిస్తున్నాడు. జెర్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు.

ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీలో నానికి జోడిగా కీర్తి సురేష్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌.నేను లోకల్‌ సినిమాలో నాని, కీర్తి సురేష్ క‌లిసి న‌టించారు.ఈ సినిమా మంచి విజ‌యాన్ని కూడా సాధించింది.దీంతో నాని ప‌క్క‌న కీర్తి అయితే బాగుంటుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడు.కీర్తి ఎంపిక‌పై అనౌన్స్‌మెంట్ రావ‌ల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -