Wednesday, May 15, 2024
- Advertisement -

ఆంధ్రజ్యోతి సర్వే సంస్థ లెటర్‌హెడ్‌ పై చూపగలదా..!

- Advertisement -

ఇటీవల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే అధికారం అంటూ ఆంధ్రజ్యోతి మీడియా ప్రసారం చేసిన సర్వే ఇప్పుడు సదరు మీడియా సంస్థకు తలనొప్పిగా మారింది. గతంలో లగడపాటి తరపున సర్వేలు నిర్వహించిన సంస్థే ఈ సర్వే నిర్వహించిందంటూ ఆర్‌జీవీ ప్లాష్ సర్వే పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. కానీ సదరు సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టు వేరు.. చానల్ ప్రసారం చేసిన సంగతులు వేరని తేలింది.

సర్వే సంస్థ రిపోర్టును మార్చేసి టీడీపీకి అనుకూలంగా ఆంధ్రజ్యోతి సర్వే లెక్కలను మార్చేసిందని చెబుతున్నారు. నిజానికి అసలు సర్వేలో టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయని.. కానీ సదరు మీడియా సంస్థ యాజమాన్యం మాత్రం సాహసించి గణాంకాలను తారుమారు చేసిందంటున్నారు. తీరాసర్వేను చానల్‌ తెరపై చూసిన సర్వే నిర్వాహణ సంస్థకంగుతింది. కొందరు నేతలు సదరు సంస్థ ప్రతినిధులకు నేరుగా ఫోన్ చేసి ఆరా తీయగా .. రిపోర్టును మార్చేశారని వివరించారు.

సర్వే రా మెటీరియల్‌తో పాటు సర్వే సంస్థ తన లెటర్‌హెడ్‌పై ముఖ్యమైన పాయింట్లను రాసి సదరు మీడియాకు అందజేసింది. గణాంకాలను మార్చినప్పటికీ లెటర్‌హెడ్‌పై సర్వే సంస్థ ఇచ్చిన కీ పాయింట్లు ఇప్పుడు సదరు మీడియా సంస్థకు ఇబ్బందిగా మారింది. ఆంధ్రజ్యోతి సంస్థ ప్రసారం చేసిన సర్వే రిపోర్టు నిజమైనదైతే.. సర్వే సంస్థ ఇచ్చిన లెటర్‌ హెడ్‌ను బయటపెట్టాలని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. వైసీపీ నేతల సవాళ్లను లెక్కచేయకపోయినా.. ఇప్పుడు సర్వే సంస్థే ఎదురుతిరిగింది.

తమ పేరుతో తప్పుడు సర్వేను ప్రసారం చేసి తమ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీశారంటూ రగిలిపోతోంది. ప్రతిగా మీడియా సంస్థపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రధాని నుంచి లోకల్ ఎమ్మెల్యేల వరకు సవాళ్లు విసురుతూ తమది దమ్మున్న చానల్ అని చెప్పుకునే సదరు చానల్‌ అందరూ డిమాండ్ చేస్తున్నట్టు లెటర్‌హెడ్‌ను బయటపెడుతుందా అన్నది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -