బిగ్‌బాస్‌లో అస‌లు ఏం జ‌రుగుతుంది?

- Advertisement -
భారీ అంచనాల మ‌ధ్య  తెలుగు బిగ్‌బాస్ రెండవ సీజ‌న్ ప్రారంభం అయింది.బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు యాంక‌ర్‌గా నాని వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.ఇక బిగ్‌బాస్‌లో నాని యాంక‌రింగ్‌పై భిన్నాభిప్రాయ‌లు ఉన్నాయి.షోలో మొద‌టి ఎలిమినేష‌న్‌లో భాగంగా కామ‌న్ మ్యాన్‌గా వ‌చ్చిన సంజ‌న ఎలిమినేట్ అయింది.ఇక నిన్న‌(శుక్ర‌వారం)జ‌రిగిన ఎపిసోడ్‌లో పెద్ద గొడ‌వ‌లు జ‌రిగాయి.షోలో రెండు గ్రూపులుగా విడిపోయారు జ‌నాలు .నూత‌న నాయుడికి,సామ్రాట్‌కు మ‌ధ్య మొద‌టి గొడ‌వ జ‌రిగింది.
 
ఈ గొడ‌వ‌లో నూత‌న నాయుడికి కౌశిల్ స‌పోర్టు చేయ‌గా,సామ్రాట్‌కు త‌నీష్ మ‌ద్ధ‌తుగా నిలిచాడు.మాట మాట పెరిగి పెద్ద గొడ‌వ జ‌రిగింది.నూత‌న నాయుడు త‌నీష్‌ని మూ..కో అన‌డంతో గొడ‌వ తార స్థాయికి చేరింది.ఇక ఈ వ్య‌వ‌హ‌రంలో నేను ఉండాలి క‌దా అంటు వ‌చ్చింది తేజ‌శ్వి.రావ‌డంతోనే కౌశిల్‌తో గొడ‌వ ప‌డింది.పిల్ల‌ను(దీప్తి సునైనా) ఎత్తుకొవడం కాదు నన్ను ఎత్తుకో చూస్తా అంటు కౌశిల్‌తో గొడ‌వకు దిగింది.ఇది ఇలా ఉండ‌గా కౌశిల్ బిహేవియ‌ర్ లేడిస్‌తో  బాలేద‌ని కిరీటి అన‌డంతో మ‌ళ్లీ గొడ‌వ పెద్ద‌దిగా మారింది.ఈ గొడ‌వ కొట్టుకునే స్థాయికి వెళ్ల‌డంతో, అంద‌రు క‌లిసి వీరిద్ద‌రిని విడ‌దీశారు.ఇక ఈ వారం కెప్టెన్సీ రేసులో అమిత్ విజ‌యం సాధించాడు.
 
ఇది అంతా    ముందుగానే  ప్రోమోల ద్వారా   జ‌నాల‌లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా షోకి మంచి రేటింగ్స్ వ‌స్తున్నాయి.అయితే ఇది అంతా షోలోని స్క్రీప్ట్‌ను బ‌ట్టే వారంద‌రు ఇలా బిహేవ్  చేస్తున్నారని అంటున్నారు కొంద‌రు.మ‌రి రెండ‌వ వారంలోనే ఇన్ని గొడ‌వ‌లు జ‌రిగితే షో అసాంతం ఇంకా ఎన్ని  గొడ‌వ‌లు జ‌రుగుతాయో.చూస్తునే ఉండండి బిగ్‌బాస్‌లో మ‌రింత మ‌సాలా ఖాయం.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -