హీరోయిన్ కీర్తి సురేష్ తన తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది.అందంతో పాటు నటనతో అందరి దృష్టి తన మీద పడేలా చూసుకుంది కీర్తి.ఇక మహనటి సినిమాతో ఆమె క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి.సినిమాలోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.సావిత్రి మళ్లీ పుట్టిందా అనే అనుమానం అందరికి కలిగింది అంటే,అంతాలా కీర్తి తన నటనతో మెప్పించింది.ఈ సినిమా తరువాత తమిళ సినిమాలతో బిజీగా ఉంది కీర్తి సురేష్.విక్రమ్,విజయ్,విశాల్ ఇలా అందరి స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది.తాజాగా ఆమె చేసిన పనితో మరోసారి మహనటి సావిత్రిని గుర్తు చేసింది.
విశాల్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పందెంకోడి – 2’ సినిమాలో కీర్తి హీరోయిన్. ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందట. షూటింగ్ చివరి రోజున యూనిట్ మెంబర్స్ అందరికే ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందట. ఇంతకీ అదేంటి? అందరికీ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందట. ‘పందెంకోడి – 2’ సినిమాకు కలిసి పనిచేసినందుకు గుర్తుగా ఆ బంగారు నాణేలు బహుమతి అన్నమాట. ఇలా అప్పట్లో సావిత్రి కూడా సినిమా షూటింగ్ చివరి రోజున ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేవారటా.దీంతో కీర్తి కూడా అలానే చేస్తుందని సమాచారం.కీర్తి సురేష్ మహనటి సినిమా షూటింగ్ చివరి రోజున ఇలానే గోల్డ్ కాయిన్స్ పంచి అందరి మనసులను దోచుకుంది.