Saturday, April 27, 2024
- Advertisement -

గోల్డెన్ ఛాన్స్..కీర్తి సురేష్‌తో సుహాస్!

- Advertisement -

డిఫరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న హీరో సుహాస్. రీసెంట్‌గా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండుతో హిట్ కొట్టిన సుహాస్..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో సినిమాకు కమిట్ అయ్యారు సుహాస్.

ఇక తాజాగా సుహాస్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. మహానటి కీర్తి సురేష్‌తో సుహాస్ సినిమా తెరకెక్కనుందని టీ టౌన్‌లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను అమెజాన్ తెరకెక్కించనుండగా ఈ ప్రాజెక్ట్ కు ఉప్పుకప్పురంబు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐవి శశి డైరెక్షన్ లో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

వరుస హిట్ సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్ తన రెమ్యునరేషన్‌ను రూ.3 కోట్లకు పెంచాడని టాక్ నడుస్తోంది. మొత్తంగా కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్లతో నటించే ఛాన్స్ కొట్టేసిన సుహాస్‌ను అంతా అభినందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -