Monday, May 5, 2025
- Advertisement -

ముందుగానే రాబోతున్న చిరు!

- Advertisement -
khaidi no 150 release date confirmed

మెగా అభిమానులను అలరించడానికి చిరు తన 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150’ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే సమయం దగ్గరి పడుతుండడంతో సంక్రాంతి లెక్కలు మారుతున్నాయి. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో బరిలో దిగే సినిమా రిలీజ్ తేదీల్లో మార్పులు జరుగుతున్నాయి. చిరు, బాలయ్యతో పోటీకి దిగుదాం అనుకున్న నాగార్జున వెనకడుగు వేశారు. నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ ముందుగా సంక్రాంతి కే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య సినిమాలు ఉండటంతో.. ఓం నమో వెంకటేశాయను ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు.

తాజాగా మరో సినిమా విషయంలో మార్పు జరిగింది. చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ ని జనవరి 13 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాని రెండు రోజులు ముందుగానే రిలీజ్ చేయడానికి రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. పండుగ సెలవుల్లో ముందుగా రిలీజ్ చేస్తే కలెక్షన్లు బాగా వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వెగంగా జరుగుతుండగా.. మరో వైపు ఎడిటింగ్ వర్క్ అదే వేగంగా జరుగుతోంది. జనవరి 11 వ ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ చేయబోతున్నారు.

Related

  1. చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?
  2. బ్ర‌హ్మీ, అనసూయ, ర‌ష్మీ సినిమా టైటిల్ ఇదే!
  3. అఖిల్ రెండో సినిమా కథ ఇదే!
  4. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -