Friday, May 10, 2024
- Advertisement -

అఖిల్ రెండో సినిమా కథ ఇదే!

- Advertisement -
akhil akkineni second movie story

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతూ.. చేసిన మొదటి సినిమా అఖిల్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. తొలి సినిమాతో నిరాశపర్చిన అఖిల్.. ఇప్పుడు తన రెండో సినిమాతో ఎలాగైన మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. అందుకోసం చాలా నెలలుగా రెండవ సినిమా కోసం దర్శకుడు మరియు కథను ఎంచుకునే పనిలోనే ఉన్నాడు.

చాలా దర్శకులనే అనుకున్నాడు. చివరకు మనం వంటి అద్భుతమైన సినిమా తీసిన తమిళ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. వైవిధ్యంకు మారు పేరు అయిన విక్రమ్ కె కుమార్ అఖిల్ కోసం కూడా ఒక అద్బుతమైన కథను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ చిత్రంకు సంబంధించి స్టోరీ లైన్ తెగ హల్ చల్ చేస్తోంది. హీరో హీరోయిన్స్చిన్నతనంలోనే కొన్ని కారణాల వల్ల ఒకరి ఇంట్లో మరొకరు పెరుగుతారు.

పెరిగి పెద్ద వారు అయిన తర్వాత వారు ప్రేమలో పడతారు. అయితే హీరో హిందూ, హీరోయిన్ ముస్లీం అవ్వడంతో కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించరు. వారి కుటుంబాల గురించి వారికి తెలియదు. అప్పుడు వారిద్దరు తమ ప్రేమ కోసం కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించారు అనేది సినిమా. ఇలాంటి పాయింట్ ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. ఒక క్యూట్ లవ్ స్టోరీతో అఖిల్ రెండవ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుంది. ఇక ఈ సినిమాని నాగార్జుననే నిర్మిస్తుండటమ్ విశేషం.

Related

  1. మెగా హీరోయిన్‌తో అఖిల్ రొమాన్స్‌..!
  2. నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!
  3. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  4. పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో డేటింగ్ చేస్తున్నకాజ‌ల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -