Friday, May 10, 2024
- Advertisement -

చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?

- Advertisement -
chiru 150th movie Khaidi No. 150

చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా.. అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ళ పాటు  సినీ పరిశ్రమను పూర్తిగా వదిలేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి  వచ్చిన చిరు..   తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే రాజకీయాల్లో  పెద్దగా  రాణించలేకపోవడంతో ఖైదీ నెం.150 చిత్రంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ 9 ఏళ్లలో చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  పవన్ సినిమాల్లోకి వచ్చింది అన్న చిరు అండతోనే అయినా తన మేనరిజం, పవనిజంతో టాప్ ప్లేస్ ను సంపాదించుకున్నాడు. 2014లో ‘జనసేన’ పార్టీని స్థాపించి,  భవిష్యత్తులో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి  ప్రవేశిస్తానని,  ఆ లోపు వీలైనన్ని సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అయితే   ఇటీవల సినిమాలు మాననని, సినిమాలతో పాటు  రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానని వెల్లడించాడు.

కానీ అది మాత్రం జరిగేలా లేదని,  ఎందుకంటే ఒకసారి రాజకీయాల్లోకి వెళ్తే  వేరే  రంగంలో రాణించడం సాధ్యమయ్యే  పని  కాదని టాలీవుడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పవన్  2019 ఎన్నికలకి  సినిమాలకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక  చిరు  సినిమాల్లోకి  రీ ఎంట్రీ  ఇచ్చే స్పీడ్ చూస్తుంటే  పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నారు. ఇలా  చిరు..  రాజకీయాలు వదిలి తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తుండగా, పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం కోసం సినిమాల నుండి ఎగ్జిట్ అవనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇవి రెండు కాకతాళీయమే అయినప్పటికీ వినడానికి  మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ.

Related

  1. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  2. పవన్ కళ్యాణ్ కే నో చెప్పిన హీరోయిన్!
  3. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!
  4. సెక్స్ వ‌ర్క‌ర్ల సీక్రెట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -