కాస్ట్ అండ్ క్రూ
స్టార్ క్యాస్ట్ : రవి తేజ, రకుల్ ప్రీత్ సింగ్
ప్రొడ్యూసర్ : నందమూరి కల్యాణ్ రామ్
డైరెక్టర్ : సురేందర్ రెడ్డి
సంగీతం : ఎస్. థమన్
రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం ‘కిక్2’. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల అయింది. థమన్ సంగీతమందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి.
లైవ్ అప్‌డేట్స్:
కిక్2 కు U/A సర్టిఫికేట్ వచ్చింది. 168.11 నిమిషాల సమయం..
రవితేజ కిక్‌లో కిక్ కావాలి.. కిక్2 లో కిక్ కాదు కంఫర్ట్ కావాలి.. కంఫర్ట్ కోసం ఏదైనా చేస్తాడు. కిక్ కొడుకు రాబిన్ హుడ్
కొంచెం బ్యాక్ డ్రాప్ సీన్స్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. యానిమేషన్ సీన్స్ వస్తాయి.
రాబిన్ హుడ్ ఇన్‌స్ట్రక్షన్ సీన్ అమెరికాలో జరుగుతుంది.
రవి కిషన్ ఎంట్రీ చాలా హెవీ గా ఉంది. ఒక కోటలో, చుట్టూ జనాలతో కనిపిస్తాడు.. రవికిషన్.. రేస్‌గుర్రంలో మెయిన్ విలన్..
విజిల్స్ స్టార్ట్ అయ్యాయి థియేటర్‌లో.. ఎందుకంటే బ్రహ్మి ఎంటర్ అయ్యాడు. బ్రహ్మి క్యారెక్టర్ పండిట్ రవిశంకర్. కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. థియేటర్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీన్ వస్తోంది. యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.. స్టోరీ రైటర్ గా పరిచయం అవుతుంది.
ఇప్పుడే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయింది. ’అమ్మీని కడుపుల్లోన’ పాట చాలా బాగుంది.
సెటిల్‌మెంట్ శంకర్‌గా ఆశిష్ విద్యార్థి ఎంట్రీ ఇచ్చాడు. రవితేజకు ఆశిష్ విద్యార్హికి మధ్య కొన్ని సన్నివేశాలు బాగా నవ్వు పుట్టిస్తాయి.
రాబిన్ హుడ్ రవితేజకు రకుల్ ప్రీత్ సింగ్ లవ్ ప్రపోజల్ చేయడంతో సెకండ్ సాంగ్ ’నువ్వే నువ్వే’ సాంగ్ స్టార్ట్ అవుతుంది.
కోవై సరలా, పోసాని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి.
రాబిన్ హుడ్ రవితేజ కోసం సాలామాన ఠాగూర్ విలాస పూర్ గ్రామ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.
ఒక ట్విస్ట్‌తో ఇంటర్వెల్ పడుతుంది.
ఇంటర్వెల్ తర్వాత స్టోరీ విలాస్‌పూర్ గ్రామానికి సిఫ్ట్ అవుతుంది.
విలాస్‌పూర్ గ్రామ ప్రజలు చాలా బాదల్లో ఉన్నట్లు కనిపిస్తారు.
కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ బ్రహ్మానందం ఎంట్రీతో కామెడీ మొదలవుతుంది.
బ్రహ్మానందం చేసే ప్రతి పనికి రవితేజ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు.
సడన్‌గా కామెడీ రవితేజ సీరియస్ ఎమోషనల్‌లోకి వెళ్తాడు.
ఒక మహిళను దారుణంగా చంపడంతో ఎమేషనల్ సీన్స్ వస్తున్నాయి.
జబర్దస్త్ టీం చంటి చాలా బాగా చేశాడు.
టైటిల్ సాంగ్ వస్తోంది. చాలా బాగా తెరకెక్కించారు.
ట్విస్ట్ రివీల్ అయిండి. ఎమోషనల్ సీన్స్‌తో సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది.
క్ల్లైమాక్స్ పైట్ సీన్స్ మొత్తం ఎడారి ప్రాంతంలో తెరకెక్కించారు.
ఎవరి ప్రాబ్లం వారే సాల్వ్ చేసుకోవాలి అనే మెసేజ్‌తో సినిమా శుభం పలుకుతుంది.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ ఎనర్జిటిక్ పర్ఫర్మెన్స్
బ్ర్రహ్మానందం, రవితేజ మద్యన కామెడీ సీన్స్
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
Minus Points:
స్టోరీ రొటీన్ అనిపిస్తుంది.
ఎడిటింగ్
Rating: 2.75
Final verdict: ‘Comfort Limited’
కిక్- 2 విడుదలకు ముందు బిజినెస్ వివరాలు ఇవే!
రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు మరో హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిచండం మరింత ఆకర్షణీయమైన అంశం.
ఇక కిక్ సినిమా సూపర్ హిట్ కాబట్టి.. దానికి సీక్వెల్ అనే పేరును తెచ్చుకొన్న ఈ సినిమాకు మరింత క్రేజ్ ఉండనే ఉంది. రవితేజకు ఉన్న ఫ్యాన్ బలగం ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది కూడా!
మరి ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విది దాదాపు 27.50 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిందని భోగట్టా. నైజాం ఏరియాలో ఎనిమిది కోట్లకు, సీడెడ్ లో నాలుగు కోట్ల రూపాయలకు, ఏపీలో పది కోట్ల రూపాయలకు, కర్ణాకటలో 2.80 కోట్లకు, రెస్టాప్ ఇండియా 50 లక్షల రూపయాలకు, ఓవర్సీస్ లో 2.20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యిందట రవితేజ సినిమా. ఈ విధంగా మొత్తం 27.50 కోట్ల రూపాయల మార్కెట్ ను చేసిందని సమాచారం.
మరి ఇది రవితేజ సినిమా వరకూ సేఫ్ జోనే. ఎలాగూ శాటిలైట్ రైట్స్ ఉండనే ఉంటాయి కాబట్టి.. ఈ మాత్రం బిజినెస్ నిర్మాత కల్యాణ్ రామ్ కు ఊరటనిచ్చే అంశమే. మరి విడుదల తర్వాత కొన్నవారికి ఈ సినిమా ఏ మేరకు లాభాలు తెచ్చిపెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. గణాంకాలను బట్టి చూస్తే మాత్రం ఈ సినిమాను కొన్నవాళ్లుకూడా సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి!
డబుల్ కిక్ ఇచ్చేట్లుగా ఉన్నారే….
కిక్ 2 విషయంలో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. సినిమాకు సంబందించిన సాంగ్ ట్రైలర్ ను విడుదల చేయగానే సినిమాలో మ్యాటర్ ఏదో ఉందనే విధంగా పాజిటివ్ సంకేతాలు ప్రేక్షకులకు అందుతున్నాయి.
దీనికి తోడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ను అయితే చేశారు గాని ప్రమోషన్ విషయంలో దర్శకుడు,హీరో ..కళ్యాన్ రామ్ కు సరిగా స్పందించడం లేదని కొత్త పుకార్ ను మార్కెట్లో కొందరు పుట్టించారు. ఒక వేల అదే నిజమైతే…. కళ్యాణ్ రామ్ రవితేజ ను ఎందుకు మా ఫ్యామిలీ హీరో అంటూ సంభోదిస్తాడు. అలాగే సురేందర్ రెడ్డిని తారక్ కోసం మరో కథను తయారు చేయమని కళ్యాన్ ఎందుకు చెబుతాడు.సో ఫ్రెండ్స్ ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు..వాస్తవాలను నిదానంగా తెలుసుకోండి.
Kick 2 Latest Theatrical Trailer
{Youtube}mTgh5pNpSWE{/Youtube}