Monday, May 13, 2024
- Advertisement -

కిక్‌2 లో కంఫర్ట్‌ లేకపోవడానికి కారణం ఏంటంటే..?

- Advertisement -

ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సినిమా కిక్-2. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు మరో హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిచండం మరింత ఆకర్షణీయమైన అంశం.

ఇక కిక్ సినిమా సూపర్ హిట్ కాబట్టి.. దానికి సీక్వెల్‌ అనే పేరును పెట్టడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. అయితే కిక్‌2 ముందు ఇచ్చిన కిక్ కంటే మెరుగైన కిక్ ఇవ్వలేకపోతోంది. కిక్ సినిమాతో అందరికి కిక్‌ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఇప్పుడు కంఫర్ట్ ఇవ్వటంలో కొంచెం ఫెయిల్యూర్ అయ్యాడు. 

కిక్‌2 మూవీకి బ్రహ్మానందం కామెడీ, రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ హైలెట్‌ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మీ, రవితేజ, పోసానికి మధ్య వచ్చే కామెడీ సన్ని వేశాలు అందర్నీ బాగా ఆకట్టుకొంటున్నాయి. 

కథలోమ్యాటర్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ముందు సినిమాలతో పోలిస్తే బహ్మీ, రవితేజ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాలో ఇంకా ఎనర్జిటిక్‌గా ఉంటాయి. రవితేజ మిస్టర్ కంఫర్ట్‌గా చూపించే విధానం, టెంపుల్ బ్యాక్ డ్రాప్ పైట్స్, ప్రీ క్లైమాక్స్ రవితేజ, రవికిషన్ మధ్య వచ్చే ఛాలెంజింగ్ సీన్స్ కిక్‌2 హైలెట్స్‌గా చెప్పుకోవచ్చు. అయితే రన్‌ టైమ్ కాస్త ఎక్కువవ్వడం, సెకండాఫ్‌లో ఎంట‌ర్‌టైన్మెంట్ చాలా తక్కువ అవ్వడం, అలాగే చాలా సీన్స్‌ స్లోగా వెళ్ళడం బోరింగ్ అనిపిస్తుంది.  కానీ సెకండాఫ్‌లో కొన్ని ట్విస్ట్‌లు రివీల్ చేయటం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. రేసుగుర్రం హిట్‌తో మాంచి కిక్‌లో ఉన్న సురేందర్ రెడ్డి కిక్‌2 తో అందరికి మరింత కిక్ ఇస్తాడనుకున్నారు. కానీ అనుకున్నంత కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే రవితేజ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  

 

కిక్- 2 విడుదలకు ముందు బిజినెస్ వివరాలు ఇవే!

రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు మరో హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిచండం మరింత ఆకర్షణీయమైన అంశం.

ఇక కిక్ సినిమా సూపర్ హిట్ కాబట్టి.. దానికి సీక్వెల్ అనే పేరును తెచ్చుకొన్న ఈ సినిమాకు మరింత క్రేజ్ ఉండనే ఉంది. రవితేజకు ఉన్న ఫ్యాన్ బలగం ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది కూడా!

మరి ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విది దాదాపు 27.50 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిందని భోగట్టా. నైజాం ఏరియాలో ఎనిమిది కోట్లకు, సీడెడ్ లో నాలుగు కోట్ల రూపాయలకు, ఏపీలో పది కోట్ల రూపాయలకు, కర్ణాకటలో 2.80 కోట్లకు, రెస్టాప్ ఇండియా 50 లక్షల రూపయాలకు, ఓవర్సీస్ లో 2.20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యిందట రవితేజ సినిమా. ఈ విధంగా మొత్తం 27.50 కోట్ల రూపాయల మార్కెట్ ను చేసిందని సమాచారం.

మరి ఇది రవితేజ సినిమా వరకూ సేఫ్ జోనే. ఎలాగూ శాటిలైట్ రైట్స్ ఉండనే ఉంటాయి కాబట్టి.. ఈ మాత్రం బిజినెస్ నిర్మాత కల్యాణ్ రామ్ కు ఊరటనిచ్చే అంశమే. మరి విడుదల తర్వాత కొన్నవారికి ఈ సినిమా ఏ మేరకు లాభాలు తెచ్చిపెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. గణాంకాలను బట్టి చూస్తే మాత్రం ఈ సినిమాను కొన్నవాళ్లుకూడా సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి! 

 

Also Read:

Kick-2 Review

డ‌బుల్ కిక్ ఇచ్చేట్లుగా ఉన్నారే….

 

Kick 2 Latest Theatrical Trailer

 

{Youtube}mTgh5pNpSWE{/Youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -