Tuesday, April 23, 2024
- Advertisement -

అమర్ అక్బర్ ఆంటోని ట్విట్ట‌ర్ రివ్యూ

- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చితం అమర్ అక్బర్ ఆంటోని. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వెంకీ, దుబాయ్ శీను వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. శ్రీనువైట్ల ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. రవితేజకు కూడా హిట్ అవసరం. ఈ నేపథ్యంలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సారి శ్రీనువైట్ల, రవితేజ మ్యాజిక్ పనిచేస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. పైగా నడుముసుందరి ఇలియానాకు ఇది రీఎంట్రీ మూవీ. ఇలాంటి అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వస్తోంది. యూఎస్, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శన మొదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందొ చూద్దాం.

ఫస్ట్ హాఫ్ అదిరింది
శ్రీనువైట్ల మార్క్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అదిరింది. సెకండ్ హాఫ్ కూడా చాలా బావుంది. తప్పక చూడాల్సిన చిత్రం అని ర‌వితేజ అభిమానులు చెబుతున్నారు.సినిమా యావరజ్‌గానే ఉన్నప్ప‌టికి ర‌వితేజ త‌న మార్క్ కామెడాతో సినిమాను నిల‌బెట్టార‌ని తెలుస్తుంది.ఒక‌ శ్రీనువైట్ల మరోమారు పాతపంతా లోనే స్క్రీన్ ప్లేతోనే సినిమాను నడిపించాడు.చాలా రోజులు త‌రువాత తెలుగులో న‌టించిన ఇలియానా అందాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి.ఈ సినిమాలో ఇలియానా చాలా బొద్దుగా క‌నిపించి చేసే ప్రేక్ష‌కుల‌కు ఇబ్బంది క‌లిగించింది.ఓ రివేంజ్ స్టోరీని శ్రీను వైట్ల తెర‌కెక్కించిన ఈ సినిమాలో ర‌వితేజ మూడు క్యారెక్ట‌ర్లు చేశాడా లేక ఒకే క్యారెక్ట‌ర్ చేశాడా అన్న‌ది థియోట‌ర్ల‌లో చూడాల్సిందే.పూర్తి రివ్యూ కోసం చూస్తునే ఉండండి ఆద్యా న్యూస్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -