Saturday, May 4, 2024
- Advertisement -

హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్

- Advertisement -

ఫాంలో లేని హీరోయిన్లు.. స్టోరీ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్లు చేయడానికి రెడీ అని చెప్పడం మాములే. బాలీవుడ్ చిత్రాల్లో ఈ లిప్ లాక్ సీన్లు ఎక్కువగానే కనిపిస్తున్న.. తెలుగులో మాత్రం కాస్త తక్కువే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తెడా లేకుండా.. అందరు హీరోయిన్స్ లిప్ లాక్ సీన్లకు సరే అనేస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు బజ్ ఏర్పడటానికి ఈ సీన్లు బాగానే ఉపయోగపడుతున్నాయి.

హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్లు పెట్టడం మాములు అవుతున్న సమయంలో కమెడియన్ కు హీరోయిన్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం విశేషం. జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్.పి.కి ఈ అరుదైన అవకాశం దక్కింది. ఈ కమెడియన్ ఈ మధ్య సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. రీసెంట్ గా హర్రర్ కామెడీ ఎంటర్ టెయినర్ గా వస్తున్న ఇదేం దెయ్యం సినిమాలో అతడు ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రుచికి కిరాక్ ఆర్.పి. ఓ ఘాటయిన లిప్ కిస్ ఇచ్చాడు.

పాత్ర కామెడీతో కూడినదే అయినా ముద్దు మాత్రం సీరియస్ గానే పెట్టాడు. అయితే జబర్ధస్త్ ఫేం తో ఏకంగా కొంతమంది ఇలా లిప్ లాకులు కూడా చేసే స్థాయికి వచ్చేస్తారా అంటూ ఈ లిప్ లాక్ తాలూకు ఫోటో చూసిన జనాలు కంగారుపడుతున్నారు. కాకపోతే అది నిజమైనా లిప్ లాకా లేక ఫేక్ లాకా అనేది ఈ ఫోటో చూసి చెప్పడం కష్టం. కొత్త ట్రెండ్ కు తెరతీసిన ఈ లిప్ కిస్.. మరి ఎంత మందిని ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -