Monday, May 6, 2024
- Advertisement -

రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ..

- Advertisement -

2019 ఎన్నాక‌ల వ్యూహ‌క‌ర్తాగా ప్ర‌శాంత్ కిషోర్‌ను జ‌గ‌న్ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.వైసీపీ ప్లీన‌రీలో జ‌గ‌న్ తెర‌ముందుకు వ‌చ్చారు.ప్ర‌త్య‌క్షంగా కార్య‌రంగంలోకి దిగారు.ఇప్ప‌టికే రాష్ట్ర‌లో అభ్య‌ర్తిల బ‌లాబ‌లాల‌పై స‌ర్వే నిర్వ‌హించార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని… లేకపోతే రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధినేత జగన్ కు ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఏయే నియోజకర్గాల్లో అభ్యర్థులు బలహీనంగా ఉన్నోరో కూడా ఆయన ఓ లిస్టును జగన్ కు ఇచ్చేశారు. దీంతో, ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అనే టెన్షన్ నేతల్లో నెలకొంది.

ప్ర‌ధానంగా స‌ర్వేలో వైసీపీ పైర్ బ్రాండ్ మ‌హిళా ఎమ్మెల్యేగా ముద్ర‌ప‌డిన రోజానె ముందువ‌రుస‌లో ఉన్నార‌న్న వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై రోజా స్పందించారు. తాను ఓడిపోయే పరిస్థితి ఉంటే లేదా తాను ఓడిపోతానని పార్టీ భావిస్తే… వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. పోటీ నుంచి తాను తప్పుకుంటానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తనకు ఎమ్మెల్యే కావాలనే ఆశ కంటే… వైసీపీ అధికారంలోకి రావాలని, జగన్ సీఎం కావాలనే ఆశే ఎక్కువ అని అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే క్రమంలో… ఓడిపోయే అవకాశాలున్న ప్రతి ఒక్కరు పోటీ నుంచి తప్పుకుంటారని చెప్పారు. దీనికోసం దేనికైనా సిద్దమని చెప్పుకొచ్చింది రోజా.మ‌రి రోజా వ్యాఖ్య‌లు ఎంత వ‌ర‌కు వెల్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -