Friday, March 29, 2024
- Advertisement -

ఆమెను ఎందుకు అరెస్ట్ చేయరు – కేజ్రీవాల్

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటే భయమని, అందుకే అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం కేసులో ఆమెను అరెస్టు చేయడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో అగస్టా కుంభకోణంపై నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇందులో పాల్గొన్న క్రేజీవాల్ మాట్లాడుతూ దేశంలో అవినీతికి సంబంధించి కాంగ్రెస్, బిజెపిలు రెండూ ఓ కూటమి అని అన్నారు. హెలికాఫ్టర్ల కుంభకోణంలో సోనియాను అరెస్టు చేయకుండా ప్రధాని వదిలేస్తే, ప్రధాని నకిలి డిగ్రీ అంశంపై మోదీని కాంగ్రెస్ ప్రశ్నించదని ఆయన విమర్శించారు.

ఢిల్లీలో తన కార్యాలయంపై సిబిఐ దాడులు చేయించిన ప్రధాని కుంభకోణం విషయంలో మాత్రం సోనియాను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క అవినీతిపరుడ్ని కూడా అరెస్టు చేయలేదని, అందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని క్రేజీవాల్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -