Sunday, April 28, 2024
- Advertisement -

ట్రైలర్ రివ్యూ: ట్రైలర్ తోనే నవ్విస్తున్న ‘కొబ్బరి మట్ట’

- Advertisement -

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మారిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా తెలుగు తెరపైకి రానున్నాడు. అయితే ఈసారి ఒకటి కాదు మూడు అవతారాల్లో కనిపించనున్నాడు. రూపక్ రోనల్డ్సన్ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ‘కొబ్బరిమట్ట’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ట్రిపుల్ రోల్ పోషించబోతున్నాడు. తండ్రి, కొడుకు, మనవడి పాత్రల్లో సంపూ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రోయిడ్ పాత్రలలో సంపూ కనిపించనున్నాడు. తన నటనతో, డైలాగులతో, డాన్స్ తో కూడా సంపూర్ణేష్ బాబు కామెడీ ని పుట్టించనున్నాడు అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇషిక సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అమృత ప్రొడక్షన్స్ పతాకంపై సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కామ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -