Thursday, May 2, 2024
- Advertisement -

రహుల్ ద్రవిడ్ కు బీసీసీఐ నోటీసులు…తీవ్రంగా స్పందించిన గంగూలి

- Advertisement -

క్రికెట్ లో జోడు పదవుల వ్వవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వ్వవహారంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేశ క్రికెట్ ను దేవుడే కాపాడాలంటూ బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ ఆపరేషన్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌ కు బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ నోటీసులు జారీ చేయడంపై గంగూలీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా చేయడం క్రికెటర్లను అవమానించడమేనని మండి పడ్డారు. దేశ క్రికెట్‌ను ఇక దేవుడే కాపాడాలి’ అని గంగూలీ ట్వీట్‌ చేశాడు.

జాతీయ క్రికెట్‌ అకాడమీలో పని చేస్తున్న సమయం లోనే ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం ఇండియా సిమెంట్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎలా విధులు నిర్వర్తిస్తారంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజయ్‌ గుప్తా చేసిన ఆరోపణలపై ద్రవిడ్‌ను జస్టిస్‌ జైన్‌ ప్రశ్నించారు. దీనిలో భాగంగానె నోటీసులను జారీ చేశారు జస్టిస్‌ జైన్‌.

గంగూలికి మద్దతుగా బజ్జీ ట్వీట్ చేశారు. భారత క్రికెట్‌లో ద్రవిడ్‌ను మించిన మంచి వ్యక్తి మరొకరు దొరకరు. దిగ్గజాలను అవమానించేందుకు ఇలా నోటీసులు పంపిస్తున్నారు. క్రికెట్‌కు ద్రవిడ్‌ లాంటి వారి సేవలు ఎంతో అవసరం. దాదా అన్నట్లు క్రికెట్‌ను దేవుడే కాపాడాలి’ అని భజ్జీ ట్వీట్‌ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -