Tuesday, May 14, 2024
- Advertisement -

జగపతిబాబు ప్లాఫ్ సినిమాలనూ వాళ్లు డబ్ చేసుకొంటున్నారు!

- Advertisement -

ఒక ఆర్టిస్టుకు ఏదైనా ఒక సినిమా ద్వారా గుర్తింపు లభిస్తే.. అతడికి ఆ తర్వాత అనేక అవకాశాలు లభిస్తాయి. ఇది సినిమా ఇండస్ట్రీలోని న్యాయం. మరి టాలీవుడ్ అయినా..

కోలీవుడ్ అయినా దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడు కోలీవుడ్ లో జగపతి బాబుకు లభిస్తున్న ఆదరణే దీనికి సాక్ష్యం!

ఆ మధ్య ‘లింగా’ సినిమాలో నటించి తమిళులకు దగ్గరయ్యాడు జగపతి బాబు. సూపర్ స్టార్ హీరోగా నటించిన సినిమాలో నటించడం ద్వారా గుర్తింపు తెచ్చుకొన్నాడు. దీంతో జగపతికి తమిళంలో మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అనేక మంది తమిళ హీరోల సినిమాల్లో అతడికి మంచి పాత్రలు దక్కుతున్నాయి. ‘లింగా’ సినిమా ప్లాఫ్ అయినా ఆ సినిమా  ఇచ్చిన గుర్తింపుతో జగపతికి ఈ అవకాశాలు లభిస్తున్నాయి.

అంతేకాదు.. ఎప్పుడో జగపతి బాబు నటించిన సినిమాలు కూడా ఇప్పుడు తమిళంలోకి డబ్ అవుతున్నాయి. ‘లింగా’ విలన్ నటించిన సినిమాలుగా ఇవి అక్కడ విడుదల అవుతున్నాయి. ఇలా జగపతి ఇమేజ్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదీ కథ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -