Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబుపై టీడీపీలోనే ఇలాంటి అసహనమా..!

- Advertisement -

చంద్రబాబు నాయుడు ఏరికోరి వారికి ముఖ్య పదవులను ఇచ్చుకొన్నాడు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తెచ్చి కూర్చొబెట్టుకొన్నాడు. పవర్స్ విషయంలో కాదు కానీ.. కనీసం హోదా విషయంలో అయినా వారు చంద్రబాబు తర్వాతి స్థాయి వారనిపించుకొంటున్నారు.

అయితే ఇప్పుడు వాళ్లతోనే బాబుకు ఇబ్బంది కలుగుతోంది! ఈ రచ్చకు కారణం చంద్రబాబేనా లేక వాళ్లేనా.. అనే విషయంపై స్పష్టత లేదు కానీ.. తెలుగుదేశంలోనే బాబు తీరును వ్యతిరేకించే వారు కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది!

సాధారణంగా కాంగ్రెస్ లోఇలాంటి రాజకీయాలుంటాయి. ముఖ్యమంత్రిని మంత్రులు వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది! అయితే ఇప్పుడు బా దగ్గర కూడా అలాంటి పాలిటిక్స్ ప్లే అవుతున్నాయి. ముందుగా దివాకర్ రెడ్డి మొదలు పెట్టాడు. బాబు తీరును వివిధ సందర్భాల్లో ఆయన ఖండిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తయారయ్యాడు. ఈయన వివిధ అంశాల్లో బాబు తీరును మీడియా ముందు తప్పుపడుతూ వస్తున్నాడు.

గతంలో రాజధాని అంశంలో ఇప్పుడు.. కేవలం పశ్చిమగోదావరి జిల్లా కుప్రాధాన్యం ఇస్తున్న విషయంలో కేఈ బాబుపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే బాబు కూడా ఇప్పుడు ఘాటుగా స్పందించాడు. కేఈ తీరును మీడియా ముందు ఖండించాడు! ఈ విధంగా తెలుగుదేశం అధినేత తమ పార్టీ నేత, తనడిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యానాల గురించి స్పందించాడు. మరి బాబే సుప్రీమో అయినా తెలుగుదేశంలో బాబు గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారు కనిపించడం విశేషమే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -