Friday, May 3, 2024
- Advertisement -

రేపు ‘ఆర్ ఆర్ఆర్’నుంచి కొమురం భీం ఉగ్రరూపం విడుదల..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం.1’,‘సింహాద్రి’,‘యమదొంగ’ చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘ఆర్ ఆర్ఆర్’మూవీ రాబోతుంది. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఈ మూవీలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఉగ్రరూపాన్ని రేపు చూడొచ్చని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అభిమానులు కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ పిలుపునిచ్చింది.

కరోనా కష్ట కాలంలో ఎవరూ వేడుకలు జరపుకునేందుకు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకొనొ దసరా కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -