Wednesday, May 15, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండతో కొర‌టాల సినిమా వ‌ర్క్ అవుట్ అవుతుందా..?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ నిన్న(సోమ‌వారం)జ‌రిగిన నోటా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫంక్ష‌న్‌లో కొర‌టాల శివ మాట్లాడుతు…. ‘పెళ్లి చూపులు’ నుంచి విజయ్ దేవరకొండ కోసం కథను రెడీ చేయాలనుకుంటున్నాను. కానీ ఆయన విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ ఏ తరహా కథను సిద్ధం చేయాలనే విషయంలో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అన్నారు. మంచి స్క్రిప్ట్ తో త్వరలోనే విజయ్ దేవరకొండను కలుస్తాను’ అని చెప్పారు.

దీంతో కొర‌టాల‌తో విజ‌య్ సినిమా ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.తను తీసిన నాలుగు సినిమాల‌ను బ్లాక్ బాస్ట‌ర్స్ చేశాడు కొర‌టాల‌.మ‌రి అలాంటి ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా చేస్తే త‌న కెరీర్‌కు బాగా హెల్ప్ అవుతుంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ భావిస్తున్నారు.మ‌రి ఈ సినిమా ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.ఎందుకంటే కొర‌టాల‌తో సినిమా చేయ‌డానికి చిరంజీవి వంటి స్టార్ హీరోలు వెయిటింగ్ చేస్తున్నారు.అలాంటి స్టార్ హీరోల‌ని కాద‌ని విజ‌య్‌తో సినిమా చేస్తాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -