Thursday, April 25, 2024
- Advertisement -

టాప్ డైరెక్టర్ కొరటాల‌తో నాని సినిమా

- Advertisement -

మూడేళ్ల‌ల్లో దాదాపు 8 సినిమాల‌కు పైగా విజ‌యాలు అందుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు ద‌ర్శ‌కుడు కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్లు గుస‌గుస‌లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే రెండు, మూడు సినిమాలు చేతిలో ఉంచుకున్న నాని ప్ర‌స్తుతం ఈ టాప్ డైరెక్ట‌ర్‌కు అవకాశం ఇవ్వ‌డం.. కొర‌టాల శివ నానితో సినిమా తీయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌డం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇద్ద‌రు స‌క్సెస్‌ఫుల్‌లో ఉండ‌డంతో ఈ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తే మాత్రం సూప‌ర్‌హిట్‌గా నిలిచే అవ‌కావం ఉంది.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు `భ‌ర‌త్ అనే నేను` అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా వేస‌విలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. నాని కూడా కొన్ని సినిమాల‌తో బిజీగా ప్ర‌స్తుతం `కృష్ణార్జున యుద్ధం` సినిమాతో పాటు నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్నాడు. అయితే కొర‌టాల శివ అడిగితే నాని ఆ సినిమాను ప‌క్క‌న పెట్టి ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంది. దీనికి క‌థ సిద్ధ‌మైందని నిర్మాత కూడా ఒకే అయ్యార‌ని స‌మాచారం. కొర‌టాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ నానితో తీసే సినిమాను నిర్మిస్తార‌ని తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -