సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్ చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఇద్దరి టీజర్లు అందర్నీ ఆకర్షించింది. ఈ చిట్టిబాబు, రామలక్ష్మి జంట అందర్నీ ఆకట్టుకోగా ఈ జంట రాజమౌళి దర్శకత్వంలో రూపొందించే మల్టీస్టారర్‌లో కూడా వీరిద్దరూ సందడి చేస్తారని సమాచారం. ఎస్ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో కలిసి మల్టీస్టారర్‌కు ప్లాన్ వేసింది తెలిసిందే.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన రాశీఖన్నాను ఫైనల్ చేసిన సినిమా బృందం ఇప్పుడు రామ్‌చరణ్ పక్కన సమంతను ఒకే చేశారని టాక్. ఎందుకంటే ‘రంగస్థలం’లో రామ్‌చరణ్, సమంతల కెమిస్ట్రీ రాజమౌళిని ఆకట్టుకుందంట. దీంతో వారిద్దరినీ తన సినిమాలో అలాగే ఉంచేస్తానని జక్కన ఫిక్సయ్యాడు. ఇక వారిద్దరూ కాల్షీట్లు ఇస్తే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో క్రేజీగా ఈ మల్టీస్టారర్‌ని విడుదల చేయాలని ప్లాన్. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా అందర్నీ బాహుబలి అంతస్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నారు.
