Tuesday, April 23, 2024
- Advertisement -

న‌చ్చిన‌వాడితో స‌హజీవ‌నం చేసుకోమ‌ని అమ్మ చెప్పింద‌ట‌

- Advertisement -

కృతిస‌న‌న్ మ‌హేశ్ బాబు న‌టించిన 1 నేనొక్కిడినే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన దోచేయ్ సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది ఈ పొడుగు కాళ్ల సుంద‌రి. కృతికి బాలీవుడ్ మంచి అవ‌కాశ‌లే వ‌చ్చాయి. దీంతో ఈ భామ అక్క‌డ స్టార్ హీరోయిన్ అంత కాక‌పోయిన మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో మెల్ల మెల్లగా మంచి ఆఫర్లే దక్కించుకుంటుంది. కృతిస‌న‌న్ తాజాగా న‌టించిన చిత్రం లుకా ఛుపీ. ఈ సినిమా కథ మొత్తం కూడా లివింగ్ రిలేషన్ షిప్ పై నడుస్తుందట.

సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కృతి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. నేను లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నాను అంటే మా ఇంట్లో ఊరుకోర‌ని అనుకున్నాను, కాని మా అమ్మ ఒక‌సారి నా ద‌గ్గ‌రకు వ‌చ్చి నువ్వు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ నీకు నచ్చిన వాడు అయితే ప్రొసీడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. మ‌రి ఇంట్లో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు క‌దా, ఈ భామ ఎవ‌రితో లివింగ్ రిలేషన్ షిప్ చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -