Monday, May 20, 2024
- Advertisement -

బాబు మార్క్ రాజకీయం మొద‌లైంది

- Advertisement -

అవును ఆయ‌నంతే.. ఏం చేసినా.. చెప్పిన.. నిర్మోహ‌మాటంగా, అంద‌రి ముందు చెప్పే అలవాటు ఆయ‌న‌కు లేదు. ఇంత‌కీ ఎవ‌రు అనుకుంటున్నారా? ఇంకేవ‌రు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. బీజేపీ ఇలా చేస్తుంది, జ‌గ‌న్ అలా అన్నారు .. అంటూ మీడియాలో వ‌స్తు ఉంటాయి వార్త‌లు. కానీ ఏదీ కూడా చంద్ర‌బాబు పేరు మీద రాదు. ఎలా వ‌స్తుందంటే.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ అన్నార‌నో లేదా.. టెలికాన్ఫ‌రెన్స్‌లో అన్నార‌నో వ‌స్తుంది. అలా ఉంటుంది చంద్ర‌బాబు రాజ‌కీయం.

ఏపీ ప్ర‌జ‌ల‌ను ఏమార్చుతున్నారు.. కానీ సొంత పార్టీ నేత‌ల విష‌యంలోనూ చంద్ర‌బాబుది అదే వైఖ‌రి. ఎవ‌రైనా నేత‌కు టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌నుకుంటే ఆయ‌న‌కు సంబంధించిన వ్య‌తిరేక వార్త‌… ఆయ‌న అనుబంధ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మవుతోంది. ఇక ఎవ‌రికైనా టికెట్ కేటాయించాలంటే ముందుగానే ఆయ‌న‌కు సంబంధించిన మీడియాలో లీకులు ఇస్తారు. ఆ త‌ర్వాత దానిపై వ‌చ్చే రియాక్ష‌న్స్‌ను గ‌మ‌నించి నిర్ణ‌యం తీసుకుంటారు.

ఇక ఇప్పుడేమో ఆల్రెడీ తేల్చేసిన నియోజకవర్గాల అభ్యర్థులను ఒకటికి రెండుసార్లు ప్రకటించడం.. పెండింగ్ లో పడిన నియోజకవర్గాలను పెండింగ్ లోనే పెట్టడం.. ఈ తరహాలో సాగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక.

కొన్ని రోజుల‌ కిందటే నెల్లూరు ఎంపీ సీటు పరిధిలోని నియోజకవర్గాల గురించి అభ్యర్థుల ప్రకటన అంటూ చంద్రబాబు నాయుడు సమీక్ష అనంతరం కొన్ని పేర్లను బయటకు వదిలారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి, నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ, నెల్లూరు ఎంపీ సీటుకు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అంటూ లీకులు ఇచ్చారు.

అయితే ఈ నిర్ణ‌యంపై ఏమైనా తేడా కొట్టిందేమో ఇప్పుడు నెల్లూరు ఎంపీ సీటుకు అభ్యర్థి ఎంపిక ఇంకా పూర్తికాలేదని ఇప్పుడు ప్రచారం మొద‌లైంది. నెల్లూరు ఎంపీ సీటు నుంచి పోటీచేయాలని ఒంగోలు మాజీఎంపీ మాగుంటను కోరుతూ ఉన్నారట! అయితే అందుకు ఆయన సమ్మతంగా లేరని సమాచారం.

ఇక నెల్లూరు జిల్లాకే సంబంధించి నెల్లూరు రూరల్ సీటును ఆదాలకు కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆదాల వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. సరైన భరోసా లభిస్తే ఆదాల పార్మీ మారేందుకు సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. ఇక కోవూరు సీటును పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికే ఖరారు చేశారని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇవేమీ ప్ర‌క‌టించ‌లేదు. అన్ని లీకులే.

అసంతృప్త నేతలను ఇలాంటి ప్రకటనలు చూసి భగ్గుమనే అవకాశం ఉంది. అలాంటివారు సంప్రదిస్తుంటే.. అబ్బే ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదని.. మీడియా హడావుడే అని సమాధానం వస్తోందట. అనుకూల మీడియా ద్వారా మాత్రం అభ్యర్థిత్వాల విషయంలో లీకుల రాజకీయం సాగుతూ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -