Monday, May 20, 2024
- Advertisement -

” హ్రితిక్ రోషన్ తో తప్ప ఇంకెవరితో సినిమా తీయను.. “

- Advertisement -

క్రిష్ 1 టూ త్రీ సినిమాలతో యాక్షన్ సినిమాల పంథా లో తనదైన శైలి ని సృష్టించిన హీరో హ్రితిక్ రోషన్ ఇప్పుడు యాక్షన్ ని పక్కన పెడదాం అనుకుంటున్నాడు. ప్రస్తుతం హ్రితిక్ హీరోగా క్రిష్ 4 పని నడుస్తోంది. ఈ సినిమాకి హ్రితిక్ తండ్రి రాకేశ్ దర్సకత్వం కానీ నిర్మాణం కానీ చెయ్యట్లేదు . 

కేవలం సలహాదారుగా మాత్రమే ఉంటారు. సో హ్రితిక్ తో ఈ సినిమా తరవాత ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకి ఎక్కించేందుకు సిద్దం అవుతున్నాడు రాకేశ్. హ్రితిక్ లేకపోతే తనకి సినిమా చెయ్యడం ఇష్టం ఉండదు అని ఈ కథ కూడా హ్రితిక్ కి మాత్రమే సరిగ్గా సరిపోతుంది అని వాదిస్తున్నారు రాకేశ్. ఇది పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటూ అక్కడక్కడా యాక్షన్ సీన్ లతో నిండి ఉంటుంది అన్నారు ఆయన. 

 

ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే చెప్పడం చాలా కంగారు పడ్డట్టు అవుతుంది అని క్రిష్ 4 తరవాత వెంటనే దానిమీద దృష్టి పెడతాం అన్నారు రాకెష్. ప్రస్తుతం మొహెన్జడారో సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు హ్రితిక్.వేరే హీరోలకి దర్సకత్వం చెయ్యరా అంటే అబ్బే చెయ్యను అని ముక్కుసూటిగానే చెప్పేశారు ఆయన. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -