Sunday, June 16, 2024
- Advertisement -

కుమారి 21F : రివ్యూ

- Advertisement -

సుకుమార్ సినిమా అంటే కుర్రకారు లో ఒక క్రేజ్ ఉంటుంది, ఆర్యా సినిమా సమయం దగ్గర నుంచీ తనకంటూ ఒక అద్భుతమైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఆర్యా 2 , జగడం , 1 నేనొక్కడినే , 100 % లవ్ ఇలా ఏ సినిమా అయినా క్రియేటివిటీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు సుకుమార్. ఇప్పుడు స్వయంగా నిర్మాత గా మారి సినిమాని తీసిన సుకుమార్ తన అసిస్టెంట్ సూర్య ప్రతాప్ ని దర్శకుడు గా పరిచయం చేస్తూ కుమారి 21 ఎఫ్ తీసారు ఈ సినిమా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుంది అంటే రాజ్ తరుణ్ లాంటి సాధారణ కొత్త హీరోకే బెనిఫిట్ షో లు పడేంతగా సుకుమార్ ప్రభావం జనాల్లో కనిపిస్తోంది అని చెప్పాలి. 

ట్రైలర్ లో చూపించినట్టు గానే ఈ సినిమా మొత్తం హీరోయిన్ హేబా పటేల్(కుమారి) క్యారెక్టర్ చుట్టూరా తిరుగుతుంది, మోడల్ గా పనిచేసే ఆమె చాలా బోల్డ్ స్వభావం గలది. ముంబై నుంచి హైదరాబాద్ కి మోడలింగ్ చాన్స్ ల కోసం షిఫ్ట్ అయ్యి ఇక్కడ హీరో రాజ్ ని కలుస్తుంది (సిద్ధూ) . రాజ్ తరుణ్ చిల్ల్లర దొంగతనాలు చేసుకుంటూ బతికే ఒక కుర్రాడు త్వరగా డబ్బులు సంపాదించాలి అనే మత్తులో బతుకుతూ ఉంటాడు. కుమారీ యొక్క యాటిట్యూడ్ అర్ధం కాకపోయినా అనుకోని సందర్భం లో ఆమెని కలిసి నెమ్మదిగా ఆమెతో ప్రేమలో మునుగుతాడు. ఆమె మీద ఒక ప్రేమ పెంచుకుంటూ నే మరొక పక్క ఆమె క్యారెక్టర్ మీద అనుమానపడుతూ ఉంటాడు. ఆమె బోల్డ్ గా ఉండే స్వభావం నచ్చక ఇద్దరి మధ్యనా ఎన్నో క్లాష్ లు ఎదురు అవుతూ ఉంటాయి. కుమారీ అంత మొండి పిల్లగా మారడానికి కారణం ఏంటి ? సిద్దూ ఆమెని నిజంగా అపార్ధం చేసుకున్నాడా? చివరికి వారిద్దరి మధ్యనా ప్రేమ నిజమైనదే అని వారు ఎలా తెలుసుకుంటారు ? ఇలాంటి విషయాల చెబుతూ సినిమా సాగుతుంది .కుమారీ రోల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది హేబా పటేల్ , ఆమెకి ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ ఆశ్చర్యపరిచింది. ఎనేర్జేటిక్ పెర్ఫార్మెన్స్ తో రాజ్ తరుణ్ కూడా సరిగ్గా ఆ క్యారెక్టర్ లో సరిపోయాడు. ప్రేమిస్తున్న అమ్మాయిని అర్ధం చేసుకోలేని వాడుగా రాజ్ నటన ఆకట్టుకుంది. టెక్నికల్ గా దేవీ శ్రీ ప్రసాద్ , రత్న వేలు లాంటి హేమా హేమీలు ఉన్న ఈ సినిమా లో ఫ్రెష్ ఫీల్ తీసుకురావడం లో సాంకేతిక నిపుణులు బాగా పనిచేసారు. యూత్ ఫుల్ ట్యూన్ లతో చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు దేవీ శ్రీ. కొన్ని పాటలు అనవసరమైన చోట వచ్చాయి అనిపించినా సాంగ్ మొదలవడం తో మంచి ఫీల్ అందింది. డైలాగులు మొదట్లో పెద్దగా అనిపించలేదు కానీ చివర్లో చాలా చక్కగా సుకుమార్ స్థాయి లో ఉన్నాయి. సుకుమార్ తన రచనతో సినిమా ఆఖర్లో ఫ్లేవర్ ని ఉపయోగించాడు. ముగించే సమయం లో ఒక లెటర్ తో అన్ని ఇబ్బందులూ కూర్పు చేసి పూర్తి చేసిన విధానం అదిరిపోయింది. హీరోయిన్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అన్నీ బాగా కుదిరాయి. సుకుమార్ కథని ఎక్జిక్యూట్ చెయ్యడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.

ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కాస్త నీరసంగా సాగింది, చాలా చోట్ల ఆశించినంతగా సినిమా స్క్రీన్ ప్లే సాగలేదు. సుకుమార్ ఫాస్ట్ కథాంశం ఇవ్వడం ఎప్పుడూ చూసిన వారికి ఇది కాస్త బోర్ కొట్టే విషయం. ఫ్యామిలీ తో ఈ సినిమాకి వెళ్ళడం అంత పిచ్చి పని ఇంకొకటి ఉండదు, పైగా ఏ సర్టిఫికేట్ కావడం తో అసలు అలాంటి సాహసం పొరపాటన కూడా చెయ్యద్దు. సెకండ్ హాఫ్ లో సుకుమార్ తాలూకా రచన కనపడినా అది చూపించడం కోసం స్క్రీన్ ప్లే ని వేరే దారిలో లాగినట్టు అనిపించింది. చాల సీన్ లు ఇంకా బాగా తీస్తే బాగుండు అన్నట్టు అనిపించక మానవు 

మొత్తంగా కుమారీ 21 ఎఫ్ యువత కి మంచి కిక్కు ఇచ్చే సినిమా అనడం లో ఏ మాత్రం సందేహం లేదు .. మారుతి ఎంచుకునే సబ్జెక్ట్ లాంటి సబ్జెక్ట్ ని ఎంచుకోకుండా నే మారుతి స్థాయి లో యువత ని ఆకర్షించే సీన్ లు పెట్టి మళ్ళీ అందులో కూడా తన క్రియేటివిటీ నీ కన్ఫ్యూజన్ నీ కలిపెసాడు సుకుమార్. ఈ దెబ్బతో లవ్ సాగా చాలా చోట్ల కాస్త క్లారిటీ మిస్ అవుతుంది. ప్రేమ కి కావాల్సిన మచ్యూరిటీ కానీ శరీరం కాదు అంటూ సుకుమార్ ఇచ్చిన ఈ దోస యువతకి ఎంతవరకూ పనిచేస్తుందో రెండు మూడు రోజులు ఆగితే కానీ చెప్పలేం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -