లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం టైటిల్ ప్రకటించినప్పటి సినిమాకు ఆటంకాలు కొనసాగుతున్నాయి. బాబు ఈసినిమాలో విలన్గా చూపిస్తున్నారంటూ టీడీపీనేతలు వర్మపై మాటల దాడి చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గని వర్మ సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేయడంతో ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. అయితే సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని వర్మ వ్యతిరేకించారు. సెన్సార్ బోర్డ్ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. దీంతో న్యాయపోరాటికి కూడా సిద్దమని ప్రకటించారు.
- Advertisement -
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బ్రేక్….న్యాయపోరాటం చేస్తానంటున్న వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -