Saturday, May 4, 2024
- Advertisement -

పెళ్లిపై సమంత సూపర్ న్యూస్ చెప్పింది.. అదేంటంటే..?

- Advertisement -

తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో ఏ అమ్మాయికి అనందం ఉండదు చెప్పండి.. ఇప్పుడు అదే అనందంను వెయ్యి రేట్లు అనుభవిస్తోంది అందాల భామ సమంత. ఆమె ఎంతాగానో ప్రేమించిన యంగ్ హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుంది. అయితే పెళ్లి అనగానే అమ్మాయిలు అందంగా కనిపించాలని ఆశపడుతారు.

ఇప్పుడు సమంత కూడా అదే పని చేస్తోంది. గోవాలో వచ్చే నెల 6న నాగచైతన్యతో సమంత పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్‌ జరగనుంది. అయితే తాజాగా సమంత సూపర్ గా తయారై దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పెళ్లి గురించి స్పందిస్తూ.. ‘నైపుణ్యం, అందమైన హృదయం ఉన్న నా డాల్‌, స్నేహితురాలు క్రేశా బజాజ్‌. ఆమె లవ్‌స్టోరీ లెహంగాలు అద్భుతంగా ఉంటాయి. నా పెళ్లి విషయంలో నేనెవరినైనా నమ్మాను అంటే అది ఆమెనే. చాలా ఆతృతగా ఉంది. లవ్యూ’ అని సమంత రాశారు. అయితే ఆమె తన పెళ్లికి వేసుకునే.. వస్త్రాలను క్రేశా బజాజ్‌ డిజైన్‌ చేస్తున్నారన్న విషయం అర్ధం అవుతోంది.

అయితే ఆమె తాజా ఫోటోలు ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో చైతూ, సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ నిశ్చితార్థంలో సమంత తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను తలపిస్తూ స్పేషల్ గా డిజైన్‌ చేయించిన చీరలో మెరిశారు. ఆ చీర ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయంకు వస్తే.. చరణ్ సరసన.. ‘రంగస్థలం 1985’లో నటిస్తోంది. అలనే ‘మహానటి’, ‘రాజుగారి గది 2’ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -