ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్‌ల వినియేగం పెరిగిపోయింది. వాటిని ఛార్జింగ్ చేయాలంటె కేబుల్ ఉన్న ఛార్జర్‌ను ఉపయేగించాల్సిందే. ఒక ఫోన్‌కు మాత్రమే అది ఉపయేగపడుతుంది. ఎక్కువ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకే సారి ఛార్జ్ చేసుకొనె ఛార్జర్ అందుబాటులోకి రానుంది.
ప్రపంచంలోనె మొట్ట మొదటి వైర్‌లెస్ ఛార్జర్‌ను అమెరికాలోని సిలికాన్‌వేలీకి చెందిన ‘పై’ అనే ఓ అంకుర సంస్థ రూపొందించింది. పై’ గా పిలిచే ఈ పరికరం ద్వారా కేబుల్ లేకుండానే మొబైల్స్, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇది దాదాపు టేబుల్ వెయిట్ పరిమాణంలో విద్యుదయస్కాంత తరంగాల ఆధారంగా పని చేస్తుందని సంస్థ చీఫ్ టెక్నాలజీ అధికారి లక్షిన్ షీ వెల్లడించారు. ఇతడు జాన్ మెక్‌డొనాల్డ్‌తో కలిసి ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
ఈపరికరాన్ని తయారు చేయడానకి సంస్థకు సంవత్సరం కాలం పట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఛార్జర్లన్నీ కేబుల్స్‌తో తయారు చేయడం వల్ల వినియోగించడానికి అంత అనుకూలంగా లేవు. ‘పై’ వల్ల కేబుల్ లేకుండానే ఏక కాలంలో వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్చ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఈ పై పరికరానికి విద్యుత్‌ను అందించినపుడు దాని నుంచి విద్యుదయస్కాత తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విద్యుదయస్కాంత క్షేత్ర పరిధిలో గాడ్జెట్స్‌ను ఉంచినట్లయితే వాటంతట అవే ఛార్జ్ అవుతాయని వారు తెలిపారు సంస్థ చీఫ్ టెక్నాలజీ అధికారి లక్షిన్ షీ వెల్లడించారు.
