Saturday, April 20, 2024
- Advertisement -

మొత్తం చూపేస్తా.. అవ‌కాశాలు ఎలా రావో చూద్దాం..

- Advertisement -

హాట్‌హాట్‌గా క‌నిపించేందుకు హీరోయిన్ సిద్ధం

ఇక లాభం లేదు.. చూపించి అవ‌కాశాలు కొట్టేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అవ‌కాశాలు రావ‌డానికి హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి మొత్తం చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ‘అందాల రాక్షసి’గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన లావ‌ణ్య‌కు సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.. గానీ ఆశించినంతా క్రేజీ రావ‌ట్లేదు. త‌న‌తో పాటు వ‌చ్చిన ఇత‌ర హీరోయిన్లు కెరీర్ బాగానే ఉంది. ఈమెకే క‌లిసి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న ప‌ద్ధ‌తి మార్చేసి హాట్‌హాట్‌గా క‌నిపించ‌డానికి సిద్ధమైపోయింది.

దానికి అనుగుణంగా ఇటీవ‌ల ఓ ఫొటో షూట్ చేసేసింది. ఆ షూట్‌లో త‌న అందచందాల‌ను చూపించేసింది. ‘భలేభలే మగాడివోయ్‌’ సినిమా హిట్ట‌యినా లావ‌ణ్య‌కు క‌లిసి రాలేదు. విజయాలు క‌నిపించ‌క అత్తెస‌రు పాత్ర‌లు వ‌చ్చేస్తున్నాయి. వరుసగా అపజయాలు వెక్కిరించాయి. ఇంకేముంది అవకాశాలు దూరమయ్యాయి. తెలుగు తమిళం భాషల్లో అవకాశాలు లేక అల్లాడుతున్న లావణ్యత్రిపాఠి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ అంటూ మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు అని నిర్ణయించుకుందట.

తనను తాను మోడరేట్‌ చేసుకుంది. అనుకున్నదే తడవుగా గ్లామర్‌గా తయారై ఫొటో సెషన్‌ చేసుకుని సోషల్‌ మీడియాకు విడుదల చేసింది. అయితే ఆ ఫొటోలు బాగున్నాయంటూ కామెంట్స్‌ చేశారే గానీ అవకాశాలు మాత్రం శూన్యం. ఇంకా మౌనంగా ఉంటే తెరమరుగైపోవడం ఖాయం అని భావించిన ఈ అమ్మడు పక్కింటి ఇమేజ్‌ను అటకెక్కించానని చెప్పేసింది. అందరూ తనను పక్కింటి అమ్మాయి ఇమేజ్‌కే పరిమితం చేస్తున్నారని, ఇకపై ఆ ఇమేజ్‌ను కొనసాగించదలచుకోలేదని చెప్పేసింది. కొత్త కథా పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. గ్లామరస్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధ‌మ‌య్యింది. ఆ పాత్ర‌ల‌కు కూడా తాను రెడీ అని చెప్పేస్తోంది. తనకు సంతృప్తిని కలిగించే ఎలాంటి పాత్రలైనా నటించడానికి సిద్ధం అని తెలిపింది. ఇకపై అందాల లావణ్యను చూస్తారని అంటోంది.

https://www.youtube.com/watch?v=EeNbZb1gWp0

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -