Sunday, May 19, 2024
- Advertisement -

అక్ర‌మ‌సంబంధంపై స్పందించిన మ‌హ‌మ్మ‌ద్‌ ష‌మీ..

- Advertisement -

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్‌ జాహన్‌ తెలిపారు.

తనను రెండేళ్లుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, చంపాలని కూడా చూశారని ఆమె ఆరోపించింది. దీంతో షమీ అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్త మీడియాలో హల్‌చల్ చేసింది.అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్‌ మెదలెట్టారు. ఈ విషయంలో షమీ, అతని కుటుంబ సభ్యులపై ఇదివరకే పోలీసులకు సమాచారమిచ్చాను. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.’ అని హాసిన జాహన్‌ పేర్కొన్నారు.

అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయంటూ భార్య ఆరోపించడంపై షమీ స్పందించాడు. ప్రస్తుతం ధర్మశాలలో ఉన్న షమీ ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలిపాడు. తన భార్య చేసిన ఆరోపణలన్నీ అసంబద్ధమని షమీ తెలిపాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పాడు.

ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన కెరీర్‌ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆట నుంచి దూరం చేయడానికి భారీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించాడు. తన పరువు తీయడానికి ఎవరో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని షమీ ట్వీట్ చేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -