Sunday, April 28, 2024
- Advertisement -

ఫ్లాప్ హీరోయిన్‌తో వ‌రుణ్ తేజ్‌

- Advertisement -

లావ‌ణ్య త్రిపాఠి వ‌రుస సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం రావట్లేదు.రామ్‌.సాయి ధ‌ర‌మ్ తేజ్‌,వ‌రుణ్ తేజ్‌,ర‌వితేజ‌,నాగ‌చైత‌న్య ఇలా అంద‌రితో చేసిన హిట్లు మాత్రం ప‌డ‌టం లేదు ఈ అమ్మ‌డికి.వ‌రుస ఫ్లాపుల్లో ఉన్నాఈ హీరోయిన్‌కు మ‌రరో అవ‌కాశం ఇస్తున్నాడు మెగా హీరో వ‌రుణ్ తేజ్‌.ఫిదా,తొలిప్రేమ వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు వ‌రుణ్‌.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకుడు.

స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా రెండ‌వ హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాఠిని తీసుకున్నార‌ని స‌మాచారం. వ‌రుణ్‌,లావ‌ణ్యమిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.ఈ జోడి ఇప్పుడు మరో సారి తెరమీద సం‍దడి చేసేందుకు రెడీ అవుతోంది.ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -