Monday, April 29, 2024
- Advertisement -

రౌడీ హీరోకి లైగర్ దెబ్బ.. ఖుషీ మరింత వెనక్కి ?

- Advertisement -

రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కు యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రౌడీ హీరోకు ఆ మూవీ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటలని ఆశించిన విజయ్ కి లైగల్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా డైలమాలో పడ్డాయి. లైగర్ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ మూవీ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే..

అయితే విజయ్ లైగర్ తేడా కొట్టడంతో ” ఖుషీ ” విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడట మన రౌడీ హీరో. దాంతో ఈ మూవీ డిసెంబర్ లో వచ్చే అవకాశం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందట. ఈ మూవీతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని విజయ్ పట్టుదలగా ఉన్నాడు. ఎందుకంటే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి మూవీస్ మినహా విజయ్ కెరియర్ లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఇక భారీ ఆశలు పెట్టుకున్న ” లైగర్ ” కూడా డిజాస్టర్ కావడంతో..విజయ్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. మరి ఖుషీ తోనైనా విజయ్ సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ తో కామిడీ మూవీ.. వర్కౌట్ అవుతుందా ?

ఎన్టీఆర్ ను నమ్ముకొని ఆ డైరెక్టర్ తప్పు చేస్తున్నాడా ?

యష్ ను ఇబ్బంది పెడుతున్న కే‌జి‌ఎఫ్ సిరీస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -