Monday, April 29, 2024
- Advertisement -

యష్ ను ఇబ్బంది పెడుతున్న కే‌జి‌ఎఫ్ సిరీస్ !

- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కే‌జి‌ఎఫ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు కన్నడ వరకే పరిమితం అయిన ఈ హీరో.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొని నేషనల్ స్టార్ గా ఎదిగాడు. కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1300 కోట్లను వసూలు చేసి ఇండియన్ అల్ టైమ్ రికార్డ్స్ లో ఒకటిగా నిలిచింది. దీంతో ఇంతటి భారీ విజయం తరువాత యష్ తరువాతి సినిమా ఏంటి అనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. యష్ తన నెక్స్ట్ ఫిల్మ్ ను కన్నడ దర్శకుడు నార్థన్ తో చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. .

అయితే స్క్రిప్ట్ లో అనుకున్న దానికంటే చాలానే మార్పులు చేసినట్లు కన్నడ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. యష్ క్రేజ్ ను దృష్టిలో ఉంచికొని కే‌జి‌ఎఫ్ సిరీస్ మరిపించాలంటే దర్శకుడికి అంతా ఈజీ కాదు. ఏ మాత్రం తేడా కొట్టిన దర్శకుడు భారీ విమర్శలను మూటగట్టునే అవకాశం ఉంది. అంతే కాకుండా కే‌జి‌ఎఫ్ తరువాత వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవాలంటే.. యష్ కథల పరంగా మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అందుకే అటూ దర్శకుడు నార్థన్, ఇటు హీరో యష్ ఇద్దరు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తరువాతి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించెందుకు సిద్దమయ్యారట. ఇది కూడా ఒక గ్యాంగ్ స్టర్ మూవీనే అని కన్నడ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి కే‌జి‌ఎఫ్ సిరీస్ తరువాత యష్ నుంచి రాబోయే సినిమాపై తార స్థాయిలో అంచనాలు ఉండడం సర్వసాధారణమే. తన తరువాతి సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయిన డిజాస్టర్ చూసే అవకాశం ఉంది. గతంలో రామ్ చరణ్ మగధీర తరువాత ఆరెంజ్, ప్రభాస్ బాహుబలి తరువాత సాహో వంటి సినిమాలు ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. దాంతో యష్ తన తరువాతి సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. ఏది ఏమైనప్పటికి కే‌జి‌ఎఫ్ సిరీస్ తరువాత వచ్చిన క్రేజ్ హీరో యష్ కు కాస్త తలనొప్పిగానే మారిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ప్రభాస్, షారుక్ ఖాన్ మద్య బిగ్ ఫైట్..?

చిరు ఆశాలన్నీ ” వాల్తేరు వీరయ్య ” పైనే !

చరణ్- అర్జున్ తో భారీ మల్టీ స్టారర్.. బడా ప్రొడ్యూసర్ క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -