Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రభాస్ తో కామిడీ మూవీ.. వర్కౌట్ అవుతుందా ?

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అది పురుష్ ను కంప్లీట్ చేసి రిలీజ్ కు సిద్దంగా ఉంచిన ప్రభాస్.. తన తరువాతి మూవీస్ అయిన ” సలార్ “, ప్రాజెక్ట్ కే ” సినిమాలను కూడా సెట్స్ పై ఉంచాడు. ఇక ఈ మూవీస్ తరువాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ” స్పిరిట్ ” మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే క్షణం తీరిక లేకుండా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించేందుకు మరో ప్రాజెక్ట్ కు ఒకే చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో ప్రభాస్ తో మారుతి ఫుల్ లేన్త్ కామిడీ పండించనున్నాడట. అయితే ప్రభాస్ గతంలో బుజ్జిగాడు మూవీకి కామిడీ ఏ రేంజ్ లో పండించారో అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి ప్రభాస్ లోని కామిడీ యాంగిల్ ను బయటకు తీసేందుకు మారుతి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్దం చేశారట. ఈ మూవీలో ప్రభాస్ చెవిటివాడి క్యారెక్టర్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మారుతి సినిమాలలో హీరోలకు డిఫెక్ట్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో నానికి మతిమరుపు క్యారెక్టర్ పెట్టి ” భలే భలే మగాడివోయ్ ” మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అలాగే శర్వానంద్ తో తీసిన ” మహానుభావుడు ” మూవీలో కూడా హీరో డిఫెక్ట్ క్యారెక్టరే. ఆ విధంగా ఈ సారి ప్రభాస్ తో తీసే మూవీలో ప్రభాస్ ను చెవిటివాడి క్యారెక్టర్ చూపించేందుకు సిద్దమయ్యారట మారుతి. అయితే ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. మారుతి ప్రభాస్ కాంబినేషన్ మాత్రం దాదాపుగా ఖాయమే అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రాంచరణ్ మూవీని.. విజయ్ తో తీస్తున్నాడా ?

యష్ ను ఇబ్బంది పెడుతున్న కే‌జి‌ఎఫ్ సిరీస్ !

చిరు ఆశాలన్నీ ” వాల్తేరు వీరయ్య ” పైనే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -