Sunday, May 5, 2024
- Advertisement -

లియో..రన్‌ టైం లాక్‌!

- Advertisement -

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లియో. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది.

ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా రన్‌టైం లాక్‌ని చేసింది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు చూస్తే దాదాపు 3 గంటల దగ్గర నిడివి ఉండగా ఒక్క ఖైదీకు రన్ టైం తక్కువ. తాజాగా లియో కి కేవలం 2 గంటల 39 నిమిషాల రన్ టైం కట్ చేశాడట. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ సినిమాస్ నిర్మిస్తోంది.

ఇక సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా సినిమా రిలీజైన 4 వారాల్లో ఓటీటీలోకి రానుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -