Friday, May 3, 2024
- Advertisement -

వైసీపీ మాస్టర్ ప్లాన్‌ వర్కవుట్ అయ్యేనా!

- Advertisement -

టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబు అరెస్ట్‌,అవినీతిపై చర్చించేందుకు సిద్ధమైంది. ఇవాళ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాం గురించి చర్చ జరగనుండగా 26న ఫైబర్ నెట్ స్కాం గురించి, 27న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాం గురించి సభలో చర్చించేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. దీంతో అసెంబ్లీ సమావేశాల వేదికగా వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకున్న టీడీపీ సెల్ఫ్‌ గోల్‌లో పడింది. వైసీపీ నుండి ఇలాంటి నిర్ణయాన్ని ఎక్స్‌పెక్ట్ చేయని టీడీపీ నేతలు చర్చలో పాల్గొంటారా లేదా అన్నది సందిగ్దమే.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే రెండు కేసుల్లో సీఐడీ వారెంట్ దాఖలు చేయగా ఇవాళ చంద్రబాబు కస్టడీపై తేల్చనుంది న్యాయస్ధానం.

బాబు అరెస్ట్ తరువాత సింపతీ పెద్దగా వర్కవుట్ కాలేదని వైసీపీ అంచనా వేస్తోంది. ఈలోగా టీడీపీని మరింత ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు చేసిన అవినీతిని కళ్లకు కట్టినట్లు ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ వాయిస్‌ని బలంగా వినిపించే అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని వంటి నేతలను బరిలోకి దించి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే సీఎం జగన్‌ కూడా చంద్రబాబు చేసిన అవినీతిపై మాట్లాడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఓ వైపు చంద్రబాబు చేసిన అవినీతిని వివరిస్తూనే వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరువచేసేందుకు అసెంబ్లీనే కరెక్ట్ వేదికని భావిస్తున్నారట. మరి వైసీపీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -