- Advertisement -

చంద్రబాబు…మరో కేసులో 5 రోజుల కస్టడీ!

- Advertisement -

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇలాంటి కష్టపరిస్థితి ఎప్పుడు చూసిఉండరు. అవినీతి స్కాంలలో చంద్రబాబుపై కేసుల మీద కేసులు పడుతున్నాయి.టీడీపీ హయాంలో జరిగిన పలు అవినీతి స్కాంలు చంద్రబాబుకు తెలిసే జరిగాయని..ఆయనే ప్రధాన ముద్దాయి అని ఇప్పటికే ఛార్జీషిట్‌లో పేర్కొంది సీఐడీ. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరూతు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్ధానం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు చెప్పారు. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

ఈ కేసు విచారణలో ఉండగానే మరో కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును విచారించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అరెస్టు అనంతరం పూర్తి స్థాయిలో విచారించడానికి తగిన సమయం లేదని..అందుకే చంద్రబాబును పోలీసు కస్టడీలో విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ కేసులో డబ్బును రికవరీ చేయడమే కాదు అసలు షెల్‌ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరిందనేది ఇంకా తేల్చాల్సి ఉందని చెప్పారు. ఏదిఏమైనా చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -