Thursday, May 16, 2024
- Advertisement -

అది ఆడియో రిలీజ్ ఫంక్షనా.. మినీ మహానాడా!

- Advertisement -

సాధారణంగా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో రాజకీయ నేతలు కనిపిస్తూనే ఉంటారు. అయితే అది ఏదో మితంగా.. ఒకరిద్దరనమాట. ఆయా రాజకీయ పార్టీల నేతలకు దగ్గరైన వారు వారిని సినిమా వేడుకలకు ఆహ్వానిస్తూ ఉంటారు. సినిమా వాళ్లతో కలిసి కనిపిస్తే కాస్తంత ప్రచారం వస్తుంది కాబట్టి.. పొలిటీషియన్లు కూడా ఆ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. మరి కొంత వరకూ ఆ ముచ్చట బాగానే ఉంటుంది కానీ.. వీళ్లు మరీ ఎక్కువ అయితే.. అదంతబాగుండదు.

‘లయన్’ సినిమా ఆడియో విడుదల వేడుకలో కూడా అదే జరిగినట్టుంది. ఈ కార్యక్రమానికి పొలోమని తెలుగుదేశం నేతలందరూ హాజరయ్యారు! ఒకరా ఇద్దరా.. జిల్లాలు, ప్రాంతాలు తేడా లేకుండా అనేక మంది తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిధిగా వచ్చిన  ఈ కార్యక్రమానికి నేతల తాకడీ ఎక్కువ అయ్యింది.
అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలయ్య ఆ జిల్లాలోని హిందూపురానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి.. వాళ్లందరికీ ఆహ్వానాలు వెళ్లి ఉండవచ్చు. ఇక చాలా మంది మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరూ… ఇంకా బాబు క్యాబినెట్ లోని అనేక మంది మంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు.
ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇలా ‘లయన్’ సినిమా ఆడియో విడుదల వేడుక మినీ మహానాడు ను తలపింపచేసింది! మరి అధికారంలో ఉన్నప్పుడు  ఇలాంటి ముచ్చట్లు మామూలే అనుకోవాలేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -