Sunday, April 28, 2024
- Advertisement -

ఇలా అయితే ఐపీఎల్ పై ఆసక్తి పోతుందేమో!

- Advertisement -

ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పలు కుదుపులకు లోనయ్యింది. ఈ లీగ్ లో మ్యాచ్ లు ఫిక్సవుతున్నాయనే ఆరోపణలున్నాయి.

ఆ మధ్య వెలుగులోకి వచ్చి స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం కూడా పరువు తీసింది. స్పాట్ ఫిక్సింగ్ లో కొంతమంది ఆటగాళ్ల ప్రమేయం కూడా రుజువు అయ్యింది. అలాగే ఐపీఎల్ యాజమాన్యాలకు సన్నిహితులైన వారే బెట్టింగులు వేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాటికి ఆధారాలు కూడా దొరికాయి.

ప్రత్యేక కమిటీలతో ఆయా అంశాల గురించి విచారణ జరిపించారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ చైర్మన్ గా ఉండిన శ్రీనివాసన్ కు కూడా కోర్టు నుంచి అక్షింతలు పడ్డాయి. ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిణామాల మధ్య ఎనిమిదో సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది. ఇంకా రెండు మూడు మ్యాచ్ లు అయినా అయ్యాయో లేదో.. అప్పుడే ఫిక్సింగ్ నీడలు కనిపిస్తున్నాయి.
తనను బుకీలు సంప్రదించారని.. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఒక ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధ విభాగానికి సమాచారం ఇచ్చాడు. దీంతో  అధికారులు అతడితో ఈ వ్యవహారానికి సంబంధించి కూపీలాగుతున్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి మ్యాచ్ లను ఫిక్స్ చేయడం గురించి తనను సంప్రదించాడాని రాయల్స్ ఆటగాడు అంటున్నాడు. అయితే తను తలొగ్గలేదని.. ఆ ఆటగాడు చెబుతున్నాడు. ఈ వ్యవహారం గురించి విచారణ జరిపి అసలు విషయాలన్ని వెలుగులోకి తీసుకొచ్చే పనిలో పడింది అవినీతి నిరోధక విభాగం.
అయినా ఇలాంటి వరస వివాదాలు ఐపీఎల్ క్రెడిబులిటీని దెబ్బతీస్తాయో ఏమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -