- Advertisement -

రుద్రమదేవి రివ్యూ..

- Advertisement -

రుద్రమదేవి అనేది ఒక జానపద, ఫాంటసీ కాకుండా భారీ చరిత్ర కి సంబంధించిన విషయం కాబట్టి అలాంటి ఒక సనాతన చారిత్రిక విషయాన్నీ కథాంశం గా తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో సంవత్సరాలు సినిమా కోసమే రీసర్చ్ చేసిన గుణ శేకర్ ని మెచ్చుకుని తీరాలి. వరసగా ప్లాపుల దందా లో కోన సాగుతూ కూడా ఒక సూపర్బ్ బడ్జెట్ తో రంగం లోకి దిగిన గుణ తనమీద తనకి ఉన్న కాన్ఫిడెన్స్ ని చెప్పకనే చెప్పాలి.

అనుష్క, రానా, నిత్యామీనన్, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్ , కృష్ణం రాజు ఇలా మహా భారీ తారాగణం తో రూపొందిన ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడి ఇన్నాళ్ళ కి విడుదల కి నోచుకుంది. తెలుగు వారి చరిత్ర మొత్తం కాకతీయ సామ్రాజ్యం పునాదుల్లో ఉంది అంటారు కాబట్టి ఒక తెలుగు వాడిగా ఈ సినిమా చూసి తీరాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా సమీక్ష ఎలా ఉందొ చూద్దాం .. 

కథ – కథనం – చూడదగ్గ అంశాలు  

రాణీ రుద్రమదేవి గా 1200 లో కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీర వనిత గాధ ఇది , తెలుగు వారి కాకతీయ చరిత్ర ఎలాంటిది అక్కడి ప్రజలకి రుద్రమ దేవి ఏ రకంగా వీర వనిత అయింది అనేవి ప్రధాన అంశాలు గా సినిమా సాగుతుంది. చారిత్రాత్మక కథ అయినప్పటికీ గుణ ఈ సినిమా కథ కి కాస్త సొంత కవిత్వం వాడినట్టు తెలుస్తోంది, అనుష్క పాత్ర చాలా చోట్ల కాస్త క్లారిటీ మిస్సింగ్ గా అనిపిస్తుంది. గోన గన్నా రెడ్డి పాత్ర విషయం లో గుణ చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పాత్ర విషయం లో బన్నీ స్ట్రిక్ట్ గా ఉన్నాడో ఏమో కానీ కొన్ని సీన్ లు చాలా బాగా పండాయి. చాలా దృడమైన కథ తో రంగం లోకి దిగిన గుణ శేకర్ కథనం విషయం లో ఫెయిల్ అయ్యాడు. షో స్టీలర్ లు గా అనుష్క – అల్లూ అర్జున్ నిలిచిపోతారు. భారీ ప్రొడక్షన్ లు డిజైన్ లూ బాగున్నాయి. ఉన్నది ఉన్నట్టు గా చూపించడం లో గుణ సక్సెస్ అయ్యాడు. గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ ఉన్నంత సేపూ మంచి సీన్ లు పడ్డాయి. ఏనుగు తో సన్నివేశం లో రాజమౌళి రేంజ్ లో ఎలివేషన్ ఉంది అని చెప్పచు. ఇలా అక్కడక్కడా సీన్ లు తీసుకుంటే చాలా బాగున్నాయి. ప్రకాష్ రాజ్ సెకండ్ హాఫ్ కి చాలా పాజిటివ్ అయ్యారు. చాళుక్య వీరబద్రుడు గా రానా పెర్ఫార్మన్స్ బాగుంది. స్టొరీ టేల్లింగ్ చాలా బాగుంది . నిత్య మీనన్ క్యారెక్టర్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది . 

నెగటివ్ అంశాలు : 

 సినిమా ట్రైలర్ విడుదల అయిన సమయం నుంచే అంతా విజువల్ వర్క్ చూసి పెదవి విరిచారు, ఒక చారిత్రాత్మక చిత్రం అసలు జనాల లో నిలబడాలి అంటే ప్రేక్షకుడి దక్షత ముందుగా విజువల్ ఎఫెక్ట్ ల మీద ఆధారపడి ఉంటుంది. సినిమా మొత్తం మీద అలాంటి మంచి విజువల్ ఒక్కటి కూడా కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి సినిమాకి అతి ముఖ్యం అయిన వాటి విషయం లో గుణ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో అర్ధం కాలేదు . కాకతీయుల కాలం నాటి కథ అంటే థియేటర్ లో వెయ్యి స్తంభాల గుడి , భారీ తోరణాలు ఆ నైపుణ్యం అంతా చూడచ్చు అనుకుంటాం కానీ అలాంటి వాటి జోలికికూడా పోలేదు. భారీ సెట్ లు వెయ్యడం లో సిద్ద హస్తుడు అయిన గుణ అంత ఎక్కువ బడ్జెట్ చేతిలో పెట్టుకుని కూడా అసలు ఏమీ సాధించలేక పోయాడు. త్రీడీ లో నిర్మించిన సినిమా అని చెప్పుకోవడానికి తప్ప త్రీడీ ఎఫెక్ట్ ల పందేరం అసలు సరిగ్గా సాగలేదు. అనుష్క లాంటి సూపర్ హీరోయిన్ ని పెట్టుకుని ఆమె క్యారెక్టర్ ని మలచిన తీరు ప్రేక్షకులకి అసలు నచ్చలేదు. గోన గన్నా రెడ్డి మీద పెట్టిన శ్రద్ధ అనుష్క పాత్ర తీరు కి పెట్టి ఉండాల్సింది. ఫైట్ లు చూస్తున్నప్పుడు అసలు పాత్రలకి తాళ్ళు కట్టి లాగేశారు అని తేలికగా అర్ధం చేసుకోవచ్చు. క్లైమాక్స్ ఫైట్ ఎదో ఉండాలో కదా అన్నట్టు గడిచిపోయింది 

 

మొత్తానికి :: 

కాకతీయ రాజుల నాటి కథ ని అంశంగా తీసుకుని , భారీ బడ్జెట్ చేతిలో పెట్టుకుని విజువల్ వండర్ చెయ్యాల్సిన సినిమా ని గుణ ఆ పరంగా నిండా ముంచేసాడు కథ చెప్పిన విధానం చాలా బాగుంది కానీ సినిమాలోకి ప్రేక్షకుడిని పూర్తిగా తీసుకుని వెళ్ళడం లో గుణ శేకర్ దెబ్బతిన్నాడు. అక్కడక్కడా అదరహో అనిపించి మరి కొన్ని చోట్ల రాడ్ దింపేసాడు రా బాబూ అని ప్రేక్షకులు అనుకునే లా చెయ్యడం జరుగుతుంది. ట్రైలర్ చూసిన తరవాత ఒక డిసాస్టర్ సినిమా వస్తోంది అని ఊహించిన వారికి విజువల్స్ పరంగా డిసాస్టర్ చూపిస్తూ కథ పరంగా బాగా తీసాడు అనిపించాడు గుణ. ఆఖరి పది హేను నిమిషాలు పక్కన పెడితే భారీగా జనాలు థియేటర్ లకి రాకపోయినా మంచి ప్రచారాలతో ముందుకు వెళితే అబవ్ యావరేజ్ గా నిలవగలిగిన సినిమా .. పెట్టిన బడ్జెట్ ఎనభై కోట్లు తిరిగి వెనక్కి వస్తుందా అంటే .. ఆ కళామ్మ తల్లికే ఎరుక !!

Rating: 2.5/5

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -