Friday, April 26, 2024
- Advertisement -

అదితీరావు ‘మహాసముద్రం’ ఫస్టులుక్!

- Advertisement -

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తాజాగా ‘మహాసముద్రం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శర్వానంద్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు . ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, అదితీరావు ఫస్టులుక్ ను వదిలారు. 

లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతిధి రావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోలో అప్ మహాసముద్రం అంటూ ఈ లుక్ ను విడుదల చేసింది.

ఈ ఫస్ట్ లుక్ లో దుఃఖాన్ని దిగమింగుకుంటూ .. కన్నీళ్లను వర్షిస్తూ .. తడారిపోయిన పెదలతో ఆమె ఈ ఫస్టులుక్ పోస్టర్ లో కనిపిస్తోంది. తనకి ఎవరో దూరమవుతున్నట్టు.. తాను ఎవరినో విడిచి వెళుతున్నట్టు బాధతో కూడిన భావన ఆమె కళ్లలో కనిపిస్తోంది. ఇటీవల శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా దర్శకుడు రిలీజ్ చేశాడు. ఆ లుక్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -