Friday, March 29, 2024
- Advertisement -

మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !

- Advertisement -

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లో క‌రోనా ప్ర‌భావం చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీనిలో భాగంగా క‌రోనా వైర‌స్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ.. మాస్కులు ధ‌రించ‌కుండా బ‌హిరంగంగా తిరుగుతున్న వారిపై అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఎవ‌రైనా మాస్కులు ధ‌రించ‌క‌పోతే రూ.1000 జ‌రిమానా విధించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆదేశాల‌ను పోలీసులు ప‌క్క‌గా అమ‌లు చేస్తున్నారు. ఈ నెల ఈ నెల‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మాస్కులు పెట్టుకోకుండా క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అయితే, మాస్కులు పెట్టుకోకుండా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా తిరుగుతున్న వారు అత్య‌ధికంగా రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల వారే ఉంటున్నార‌ని పోలీసులు తెలిపారు. ఈ 6,500 మందిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప‌రిధిలో క‌లిపి మాస్క్‌లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదు చేసిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. వారు న్యాయ‌స్థానాల్లో సైతం హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్‌ !

కరోనా టీకా.. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

దేశంలో కొత్తగా 1.52 లక్షల కరోనా కేసులు

72 గంట‌ల్లో 12 మంది ఉగ్ర‌వాదులు హ‌తం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -