Friday, March 29, 2024
- Advertisement -

రోజా రాజకీయ అజ్ఙానం….. వ్యూహం తెలుసుకోకుండా బుక్కవ్వడం…. పార్టీని బదనాం చేయడం

- Advertisement -

దశాబ్ధానికిపైగా రాజకీయ జీవితం……వైఎస్సార్, చంద్రబాబునాయుడులతో సహా చాలా మంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులను దగ్గర నుంచి చూస్తూ రాజకీయంగా ఎదిగిన వైనం…..సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని, ఫ్యామిలీని ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చరిత్ర…..తెలుగు నాట ఒక హీరోయిన్ రాజకీయ ప్రస్థానం ఈ స్థాయిలో సాగడం గొప్ప విషయమే. అన్నింటికీ మించి ప్రజా సమస్యలపై స్పందించే విషయంలో ఇతర ఏ సినిమా హీరోయిన్ కూడా రోజాకు సాటిరారు. చాలా మంది వ్యాపార రంగాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులకంటే ఎక్కువగా ప్రజా సమస్యలపై పోరాడిన ఘనత రోజా సొంతం. కానీ ఏం ఉపయోగం? రాజకీయ వ్యూహాలను, మరీ ముఖ్యంగా టీడిపి మీడియా వ్యూహాలను పసిగట్టడంలో బోల్తా కొడుతూ అడ్డంగా బుక్కవుతూ ఉంటుంది. బ్లూ ఫిల్మ్స్‌లో నటించారా అని ఒక జంతువులాంటి జర్నలిస్ట్ ఆ మధ్య రోజాని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నను అడిగించిన ఛానల్ ఎప్పటి నుంచో టిడిపికి వీర భజన చేస్తోంది. ఇక కొంతకాలం నుంచీ టిడిపి కొమ్మకే చెందిన పవన్‌కి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. అలాంటి ఛానల్‌లో ఒక చర్చ నిర్వహిస్తున్నారు అంటే రోజా ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ కనీస స్థాయి ఆలోచన కూడా లేకుండా వెళ్ళి అడ్డంగా బుక్కయ్యింది. ఆవేశంపాళ్ళు ఎక్కువ ఉండే రోజాను రెచ్చగొట్టడంలో ఆ ఛానల్ గొప్పగా సక్సెస్ అయింది.

టిడిపికి, జనసేనకు భజన ఛానల్. స్టూడియోలో ఒక కమెడియన్ కం బినామీ కం ప్రొడ్యూసర్. ఈయన గురించి ఇండస్ట్రీలో మామూలుగా చెప్పుకోరు. స్టార్ హీరోలతో పాటు, పొలిటీషియన్స్‌కి కూడా పక్కలేసిన చరిత్ర ఉందని చాలా మంది చెప్తూ ఉంటతారు. ఇక బినామీగా కూడా గొప్ప చరిత్రే ఉంది. చాలా దిగువస్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తితో చర్చకు దిగాల్సిన అవసరం రోజాకు ఏముంది? కనీసం ఆ ఛానల్ వ్యూహాం అయినా అర్థం చేసుకోవాలిగా? ఆ తెలివిలేకుండా చర్చకు ఒకే అంది. స్టూడియోలో కూర్చున్న బూతు స్పెషలిస్ట్ నిమిషాల వ్యవధిలోనే తన బూతు స్థాయికి చర్చను దిగజార్చడంలో…….రోజాను రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఆ ఛానల్ వారు కూడా గొప్పగా ప్లాన్ చేశారు. ఇక ఆ తర్వాత రెచ్చిపోయిన రోజా ఆ కమెడియన్ స్థాయికి దిగజారిపోయి ఇష్టారీతిన మాట్లాడేసింది. ఆ ఛానల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తుంది. ఒక రోజు అత్యంత దరిద్రపు చెత్త చర్చను టెలికాస్ట్ చూసి మరుసటి రోజు గొప్ప మానవతా సెంటిమెంట్ ప్రోగ్రాం ఏదో రన్ చేసి ఈ చెడ్డపేరును అలా అలా ఏదో బేలన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ కమెడియన్ స్థాయి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మరి రోజా పరిస్థితి ఏంటి? వాళ్ళ స్థాయికి తాను దిగజారిపోయి ఆల్రెడీ జబర్ధస్త్ పుణ్యమాని తనపై పడ్డ బూతు ముద్రకు ఇంకాస్త బలం చేకూరుస్తోంది. వైకాపాకు తీవ్రనష్టం చేకూరుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా కూడా అఖిలప్రియ డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేసి అఖిలప్రియకు సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా చేసింది.

రాజకీయాలంటే ప్రజల తరపున పోరాడడం, ఎమ్మెల్యేగా గెలవడమే కాదు…..కాస్త రాజకీయ వ్యూహాల విషయంలో కూడా అప్రమత్తత ఉండాలి. అది లేకనే రోజా మరోసారి తన స్థాయిని దిగజార్చుకుంది. వైకాపాకు కూడా ఎంతో కొంత నష్టం చేసింది. ప్రత్యర్థులు తన అమాయకత్వాన్ని చూసి నవ్వుకునేలా చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -