అతడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతోంది.కొత్త రికార్డుల పేరు చెప్పి అతని చుట్టూ తిరుగుతూ….ఎవరైనా కన్ఫూజ్ చేయాలనుకుంటే మాత్రం…. ఆ కన్ప్యూజ్ లో అతను మరిన్ని రికార్డులు కొట్టేస్తాడు.అతను రికార్డులు క్రియేట్ చేయడం మొదలు పెడితే…. అదోలా ఉంటుందని మొన్నటి వరకూ అంతా చెపుకునేవారు.ఇపుడతను స్వయంగా చూపిస్తున్నాడు.
ప్రతి సంవత్సరం జరుపుకునే బర్త్ డే నే …ఈఏడాది కూడా ప్రిన్స్ జరుపుకుంటున్నాడు. కాకపోతే ఈ ఏడాది జరుపుకునే బర్త్ డే చాలా స్పెషల్ .మే 31 ఘట్టమనేని ఫ్యాన్స్ కు ఎంత పెద్ద పండగో… అదే రీతిలో ఆగస్ట్ 9 కూడా పండగలా మారిపోయింది.అభిమానులను ఆదరణతో పలకరించడమే ఘట్టమనేని హీరోలకు కలిసొచ్చేలా చేసింది.బహుశా తెలుగులో ఏ హీరోకు లేని హార్ట్ కోర్ ఫ్యాన్స్ కృష్ణకే ఉన్నారు.ఆ అబిమానులు ఇపుడు తమ ఫోకస్ ను మహేష్ కోసం పెట్టడంతో మహేష్ స్టామినా కార్పొరేట్ స్థాయికి చేరింది.
పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా సాహసాలు చేస్తూ అధ్బుతాలు చేయడంలో…. మహేష్ ఎపుడూ ముందంజలోనే ఉంటున్నాడు. ఒక్కడుతో బ్రేక్ సంపాదించిన మహేష్ ఆతర్వాత మాస్ మేనియాతో ఇరగదీయడం మొదలు పెట్టాడు.
పోకిరి చిత్రమే దానికి మాంచి ఎక్జాంపుల్. ఈ ఫిలింలో ప్రిన్స్ పలికిన ప్రతి డైలాగ్ అలా ఇలా పేలలేదు. మహేష్ లోని పూర్తిస్థాయి మాస్ లుక్ ను మాస్ పంచ్ లను ఈసినిమా ఆవిష్కరించింది.దీంతో మెగా ఫ్యామిలీకే అగ్రతాంబూలం అంటూ అరిచిన అరుపులకు చెక్ పెట్టినట్లయింది. సౌత్ ఇండియాలో అత్యంత ఎక్కవగా ప్రజాదరన పొందిన నటుడిగానే కాకుండా ఎక్కువ కార్పొరేట్ యాడ్స్ కు సైన్ చేస్తోన్న హీరోగా ప్రిన్స్ రికార్డులకు ఎక్కాడు.
ప్రిన్స్ ఎపుడూ ఒకే జోనర్లో ఉండి సేఫ్ గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపడు.చేయాల్సిన రిస్క్ ను చేస్తాడు.అయితే దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అభిప్రాయాన్ని వాళ్లకే వదిలేస్తాడు.కమర్శియల్ గా నిర్మాత సఫర్అవుతాడనే ఆలోచనలో కొన్ని సందర్బాల్లో రాజీ పడ్డాడు తప్ప ఏనాడు భయపడి వెనక్కి అడుగు వేయలేదు. చేసే ప్రతి సినిమాను ఓ యజ్ణంలా ఫీలై చేస్తాడు కాబట్టే…ఘట్టమనేని హీరోకు అంతటి సాహసగాడని పేరు వచ్చింది. తండ్రి రికార్డుల పరంపరను మనోడు కూడా కొనసాగిస్తున్నాడు.ఆ దూకుడుకు అడ్డుకట్టు వేసేవారు సౌత్లో ఎవ్వరూ కనిపించడం లేదు.
మహేష్ ను మిల్కీబాయ్ గా చూసిన ప్రేక్షకులు అతనిలో రౌద్రాన్ని చూశారు.అతని ఆవేశాన్ని ఆస్వాదించారు.పరిశ్రమలో ఉన్న అతి తక్కువ టాప్ హీరోల్లో అజాతశత్రువుగా మహేష్ బాబుకు పేరుంది.కృష్ణ మాదిరిగానే తన ప్రతి బర్త్ డే కు అభిమానులకోసం ఏదో ఒక మంచి పని చేయడానికే మహేష్ ఆసక్తి చూపుతాడు.ఈసారి కూడా అదే రీతిలో అడుగులు వేయడానికే మక్కువ చూపుతున్నాడు.
సూపర్ హిట్ వచ్చిందని ఒకసారి ఒకలా…. లేనప్పుడు మరోలా ఉండే దోరణి మహేష్ ది కాదు కాబట్టి…. మహేష్ అందరి హీరోల అబిమానుల దృష్టిలో ముక్తకంఠంతో సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు.
Mahesh Babu Birthday Special Trailer Srimanthudu New Teaser
{youtube}kWCDAhuua98{/youtube}
