Monday, May 13, 2024
- Advertisement -

మ‌హేశ్ ఫ్యాన్సా మ‌జాకానా..!

- Advertisement -

నిన్న(గురువారం) టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే ని ఆయ‌న అభిమానులు పండుగలా చేసుకున్నారు.ఎంత‌లా అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకి సాధ్యం కాని రికార్డును మ‌హేశ్ అభిమానులు సాధించారు.మ‌హేశ్ బాబు పుట్టిన రోజున సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెష్ తెలుపుతు 4.5 మిలియ‌న్ల ట్వీట్స్ వ‌చ్చాయటా.ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు ఈ విధాంగా ట్వీట్స్ రాలేద‌ని తెలుస్తుంది.మ‌హేశ్ హ్యాష్ ట్యాగ్‌తో ఆయ‌న అభిమానులు తెగ హడావిడి చేశారు.ఇక నిన్న ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా మ‌హేశ్‌కు విషెష్ తెలిపారు.మహేశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్‌,టైటిల్‌,టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.మ‌హేశ్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా(మ‌హ‌ర్షి) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

సినిమా టీజ‌ర్ విడుద‌లైన‌ విడుదలైన కొద్దీ గంటల్లోనే ఈ సినిమా 3 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండింగ్ మొద‌టి స్థానంలో ఉంది.కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న మహేష్‌.. అమ్మాయిలును త‌న కొంటే చూపుల‌తో చూస్తూ వెళ్తున్న టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది.అలా స్టైల్ గా నడుస్తూ ఒక చేత్తో హెయిర్ ని అలా దువ్వుకుంటూ మరో చేత్తో ల్యాప్ టాప్ పట్టుకుంటే ఎదురుగా వచ్చే అమ్మాయిలు ఏం కావాలి? ఓ అమ్మాయి అలా వెనక్కి తిరిగి చూస్తుంది మన మహేష్ కుడా వెనక్కి అలా తిరిగి చూస్తాడు. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు రిషి అనే పాత్రలో కనిపిస్తుండగా అల్లరి నరేష్ రవి అనే మరో కీలక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -