Monday, May 6, 2024
- Advertisement -

రష్మిక ని భయపెడుతున్న మహేష్ బాబు అభిమానులు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవరు అనే సినిమా లో పని చేస్తున్నారు. ఈ సినిమా మహర్షి వంటి పెద్ద విజయం తర్వాత రానుండటం తో అందరూ ఎన్నో అంచనాలని ఈ సినిమా మీద పెట్టుకున్నారు. అయితే ఆసక్తికరం విషయం ఏంటి అంటే ఈ సినిమా లో రష్మిక ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు దర్శక నిర్మాతలు. మహేష్ పక్కన రష్మిక ఛాన్స్ కొట్టడం నిజంగా రష్మిక అదృష్టం అనే చెప్పాలి.ముందుగా ఈ పాత్ర కోసం వేరే హీరోయిన్ల ని అనుకున్నా, చివరికి ఈ పాత్ర రష్మిక నే వరించింది.

అయితే రష్మిక కూడా డియర్ కామ్రేడ్ సినిమా తో విజయం సాధించడం తో, తన స్టార్డం, మార్కెట్ వాల్యూ సరిలేరు నీకెవరు కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం ట్విట్టర్ లో రష్మిక కి వార్నింగ్ ఇస్తూ భయపెడుతున్నారు. రష్మిక ని మహేష్ పక్కన ఊహించుకోవడం ఇష్టం లేని కొందరు రష్మిక ని ఈ సినిమా నుండి వైదొలగాలని వార్నింగ్ ఇస్తున్నారు. సరిలేరు నీకెవరు చేస్తే మాత్రం, అదే ఆమెకు చివరి చిత్రం అవుతుంది అని కొందరు బెదిరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -