Thursday, May 2, 2024
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్ను మూత..

- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ (60) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్‌ గౌడ్‌.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2009 కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2010 నుంచి 2014 త వైఎస్‌ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు.

మహారాజ్ గంజ్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ గౌడ్, రెండుసార్లు ఓడిపోయారు. 2014, 2019లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన సమయంలోనే ఆయన పూర్తిగా చిక్కి శల్యం అయిపోయి కనిపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా ఆయనకు ప్రాధాన్యత దక్కింది. ఆయనకు భార్య.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -