Saturday, May 4, 2024
- Advertisement -

‘ఎన్.టి.ఆర్’లో మెర‌వ‌నున్న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు

- Advertisement -
విశ్వవిఖ్యాత నటుడు.. రాజకీయ దురంధ‌రుడు స్వ‌ర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథతో తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆయన తనయుడు ‘ఎన్.టి.ఆర్’ సినిమా రూపొందుతోంది. ఆయ‌న త‌న‌యుడు బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. ఈ సినిమా షూటింగ్ రామకృష్ణ స్టూడియోస్‌లో ప్ర‌ముఖుల మ‌ధ్య ప్రారంభ‌మైంది. అయితే ఈ సినిమాలో ఓ విశేషం ఉండ‌నుంద‌ని స‌మాచారం.
ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు క‌నిపిస్తాడ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు తేజ త‌న‌కు చెప్పాడ‌ని ఇటీవ‌ల కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న శ్రీరెడ్డి ప్ర‌క‌టించింది. ఈమెనే కాదు ఇండ‌స్ట్రీలో కూడా ఈ విష‌య‌మై వార్త షికారు చేస్తోంది. మ‌రీ ‘ఎన్.టి.ఆర్’ సినిమాలో మ‌హేశ్‌బాబు ఏ పాత్ర‌లో క‌నిపిస్తాడో చూడాలి. సీనియ‌ర్ ఎన్టీఆర్ పీరియ‌డ్‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్‌, కృష్ణ అనుంబంధాన్ని ‘ఎన్.టి.ఆర్’ సినిమాలో చూపే అవ‌కాశం ఉంది. ‘ఎన్.టి.ఆర్’ సినిమాలో కృష్ణ పాత్ర ఉండి ఆ పాత్ర‌లో మ‌హేశ్‌బాబును తీసుకున్నారు అని ఎవ‌రికి వారు ఊహించుకుంటున్నారు.
కానీ ఈ ఊహే నిజ‌మైతే ‘ఎన్.టి.ఆర్’ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌యిన‌ట్టే.
బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌ను బాల‌కృష్ణ ప్రారంభించి ఈ సంస్థ నిర్మాణంలో ‘ఎన్.టి.ఆర్’ సినిమా రూపుదిద్దుకుంటోంది. సాయి కొర్రపాటి, విష్ణువర్థన్‌ ఇందూరి సహ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నటీనటుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -